Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య..

Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

Evaru Meelo Koteeswarulu

Updated On : December 2, 2021 / 4:54 PM IST

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య ప్రజల నుండి కంటెస్టెంట్లతో పాటు వరుసగా టాప్ స్టార్స్ తో కూడా ఎపిసోడ్స్ చేస్తూ షోను హైలెట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలతో ఎపిసోడ్స్ చేసిన తారక్ సూపర్ స్టార్ మహేష్ తో కూడా ఒక ఎపిసోడ్ చేశాడు.

Shraddha Das: శ్రద్ధగా ఆరబోయాలంటే శ్రద్ధా తర్వాతే ఎవరైనా!

నిజానికి ఈ ఎపిసోడ్ ఎప్పుడో షూట్ చేసి పెట్టారు. సరైన ముహూర్తం చూసి వదలాలని చూస్తున్న షో నిర్వాహకులు ఇప్పటికే టీజర్ విడుదల చేసి ఎపిసోడ్ మీద హైప్ క్రియేట్ చేశారు. కాగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ కు ముహూర్తం పెట్టేశారు. ఈ ఆదివారమే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయనున్నారు. డిసెంబర్ 5వ తేదీ ఆదివారం రాత్రి 8.30 నుండి ప్రసారం కాబోతుందని ప్రకటించిన నిర్వాహకులు ఈ సందర్భంగా ఓ లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు.

Bangarraju: ‘నా కోసం మారావా నువ్వు’.. సిద్ శ్రీరామ్ నుండి మరో మ్యాజిక్!

ఈ ప్రోమోలో 15వ ప్రశ్న ఫస్ట్ అడిగేయమని మహేష్ సరదాగా అంటుంటే.. కోటి ఇచ్చేసి తగ్గించుకుంటూ వెయ్యికి రమ్మంటారా అని ఎన్టీఆర్ నవ్వేశారు. ఈ క్రమంలో కోటి రూపాయలకు 15వ ప్రశ్న మీ కొత్త కంప్యూటర్ స్క్రీన్ మీద అని ఎన్టీఆర్ ఆట పట్టించారు. మొత్తంగా ఈ లేటెస్ట్ ప్రోమో నెట్టింట సందడి చేస్తుండగా.. ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు.. స్మాల్ స్క్రీన్ మీద మీద హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ గ్యారంటీ అని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇక, ఈ షోలో మహేష్ రూ. 25 లక్షలు గెలుపొందారని లీకవగా ఆ మొత్తాన్ని సూపర్ స్టార్ ఓ ఛారిటీకి డొనేట్ చేశాడని తెలుస్తుంది.