RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ ఇప్పటికే భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

Rrr

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు యూనిట్ ఇప్పటికే భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది.ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ట్రైలర్ కూడా త్వరలోనే వచ్చేయనుంది. ముందుగా డిసెంబర్ 3న ట్రైలర్ రిలీజ్ చెయ్యాలనుకున్నా లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో ఇది కాస్త వాయిదా పడింది.

Evaru Meelo Koteeswarulu: ముహూర్తం ఫిక్స్.. కోటి ప్రశ్న ముందు అడిగేయ్ తారక్!

త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్న ఆర్ఆర్ఆర్ టీం.. అక్కడ నుండి ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టనుంది. కాగా, దర్శకుడు రాజమౌళి ఇప్పటికే బాహుబలి పేరిట ఓ రికార్డుల కోటను కట్టేశారు. ఇప్పటి వరకు వచ్చిన మిగతా స్టార్ హీరోల సినిమాలన్నీ బాహుబలిని వదిలేసి నాన్ బాహుబలి అంటూ కలెక్షన్లను లెక్కలేసుకున్నారు. దీంతో బాహుబలి రికార్డులన బద్దలు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి వలనే అవుతుందని ప్రేక్షకులు మెంటల్ గా ఫిక్సయిపోయారు. మరి ఆర్ఆర్ఆర్ ఆ రికార్డులను బద్దలు కొడుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

Shraddha Das: శ్రద్ధగా ఆరబోయాలంటే శ్రద్ధా తర్వాతే ఎవరైనా!

ఎందుకంటే జనవరి 7న సినిమా విడుదలకి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఐదు రోజుల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` భారీ అంచనాల మధ్య రానుంది. 6 రోజుల గ్యాప్ లో మరో పాన్ ఇండియా సినిమా `రాధేశ్యామ్` కూడా వచ్చేస్తుంది. తమిళంలో అజిత్ వాలిమైతో పాటు ప్రతి భాషలో ఇదే తరహా కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు బాహుబలి రికార్డులను కొట్టే స్కోప్ ఆర్ఆర్ఆర్ కి ఉంటుందా అనే సందేహాలు తెస్తుంది. కేవలం ఐదు రోజులు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకి థియేటర్ల పరంగా ఫుల్ స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి భాషలో రెండిటికి తగ్గకుండా సినిమాలతో థియేటర్లు పంచుకోవాల్సి ఉంటుంది.

Bangarraju: ‘నా కోసం మారావా నువ్వు’.. సిద్ శ్రీరామ్ నుండి మరో మ్యాజిక్!

గతంలో బాహుబలి సినిమా సమయంలో థియేటర్లలో ఎలాంటి అడ్డూ అదుపూ లేదు. దీంతో బాబుబలి చెలరేగిపోయాడు. కానీ.. ఇప్పుడు థియేటర్లకు వచ్చేందుకు ఇంకా ధైర్యం చేయని ప్రేక్షకులతో పాటు థియేటర్లను మూడు సినిమాలను పంచుకోవడంతో కలెక్షన్ల పరంగా బాహుబలి రికార్డుల కోట బద్దలు కొట్టడం సాధ్యమా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి రూ.400 కోట్ల భారీ బడ్జెట్ సినిమాతో బాహుబలిని మించిన వసూళ్లే టార్గెట్ గా కనిపిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.