Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

ఈమధ్య ఏ చిన్న హీరో అయినా.. పేరుకు ముందు స్టార్ లేనిదే ఒప్పుకోవడంలేదు. అందుకే లేని పోని ట్యాగ్ లు తగిలించి మరీ హీరోలను స్టార్ లుగా పిలుస్తున్నారు. ఇలా పిలిచి మరీ పిలిపించుకుంటున్న..

Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

Ajith Kumar

Ajith Kumar: ఈమధ్య ఏ చిన్న హీరో అయినా.. పేరుకు ముందు స్టార్ లేనిదే ఒప్పుకోవడంలేదు. అందుకే లేని పోని ట్యాగ్ లు తగిలించి మరీ హీరోలను స్టార్ లుగా పిలుస్తున్నారు. ఇలా పిలిచి మరీ పిలిపించుకుంటున్న హీరోలున్న ఈ జనరేషన్ లో.. ఓ తమిళ్ స్టార్ హీరో మాత్రం నా పేరుకు ఎలాంటి తోకలు యాడ్ చెయ్యొద్దు.. జస్ట్ నా పేరుతో మాత్రమే పిలవడంటూ స్ట్రిక్ట్ గా నోట్ రిలీజ్ చేశారు.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

తమిళ్ స్టార్ హీరోగా అజిత్ కి విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంత ఫాన్స్ ఉన్నా.. అజిత్ మాత్రం ఎప్పుడూ తన స్టార్ డమ్ ని, తన క్రేజ్ ని చూపించుకోకుండా ఎప్పుడూ డౌన్ టూ ఎర్త్ గానే ఫాన్స్ తో ఉంటారు. అందుకే ఫాన్స్ అందరూ ముద్దుగా తల అని పిలుస్తారు. కొన్నేళ్లుగా ఫాన్స్ నుంచి ఈ పిలుపు అందుకుంటున్న అజిత్.. సడెన్ గా నా ముందు తల తీసెయ్యండి అంటూ ఫాన్స్ కి కాస్త సీరియస్ గానే చెప్పారు.

Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

అజిత్ సడెన్ గా తన పేరు ముందున్న తల అనే పదం తీసెయ్యాలని.. తనని ఆ పేరుతో ఎవ్వరూ పిలవద్దని మీడియాతో పాటు ఫాన్స్ కి కూడా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నా పేరు అజిత్ కుమార్, జస్ట్ అజిత్ అని పిలవండి, లేకపోతే ఏకే అని పిలవండి అంతే కానీ.. నా పేరుకు ముందు ఎలాంటి స్టార్ స్టేటస్ లు అవసరం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

Sonakshi Sinha: మతులు పోగొడుతున్న బొద్దుగుమ్మ సోనాక్షి

అజిత్ ఇప్పుడే కాదు.. అంతుకుముందు కూడా అల్టిమేట్ స్టార్ అని పిలిపించుకునే అజిత్.. అప్పుడు కూడా అలా పిలవద్దని, తన అభిమాన సంఘాల్ని కూడా రద్దు చేశారు అజిత్. తమిళ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్.. సడెన్ గా ఇలా తన పేరు ముందు లీడర్ అని అర్దం వచ్చేలా ఉన్న తలని తీసెయ్యండని చెప్పడంతో ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అజిత్ ప్రజెంట్ వలిమై సినిమాతో బిజీగా ఉన్నారు.