Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

బాలీవుడ్ లో వరసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయిన సినిమాలన్నీ రిలీజ్ కి లైన్ కడుతున్నాయి. అసలు సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి..

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

Bollywood Movies

Bollywood Movies: బాలీవుడ్ లో వరసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయిన సినిమాలన్నీ రిలీజ్ కి లైన్ కడుతున్నాయి. అసలు సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి.. ఇంట్రస్టింగ్ గా ఉన్న టీజర్ నో, ట్రైలర్ నో రిలీజ్ చెయ్యాలి. కానీ బాలీవుడ్ మేకర్స్ చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తోనే సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్నారు.

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

ట్రెండ్ మారిపోయింది. సినిమాకు సంబంధించి ప్రతీదీ ఇంట్రస్టింగ్ గానే డిజైన్ చేస్తున్నారు. ఆడియన్స్ లో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యడానికి తెగ కష్టపడుతున్నారు. జస్ట్ పోస్టర్ తో సినిమా చూసే జనాలు తగ్గిపోయారు. అందుకే సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వరకూ ప్రతీదీ క్రియేటివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు బాలీవుడ్ హీరోలు. స్పెషల్లీ బాలీవుడ్ హీరోలు ఈ విషయంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతోంది. సల్మాన్ సినిమా అంటే జనాలకు పండగే పండగ. అదీ సూపర్ హిట్ మూవీ టైగర్ కు సీక్వెల్ గా వస్తున్న టైగర్ 3 అంటే ఆ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయ్..? అదే రేంజ్ లో సినమా రిలీజ్ అనౌన్స్ చేశారు సల్మాన్. కత్రినా కైఫ్, సల్మాన్ జంటగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ టైగర్ 3 ఏప్రిల్ 21 2023లో రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ అంటే ఏదో సింపుల్ గా పోస్టర్ తో కాదు.. కత్రినా, సల్మాన్ యాక్షన్ ఎలివేషన్ ని శాంపిల్ చూపించి మరీ వీడియో రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ కాంబినేషన్ ని చూసిన ఫాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

రాక రాక.. 4 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న షారూఖ్ ఖాన్.. తన సినిమా పఠాన్ రిలీజ్ డేట్ ని ట్రెండీగా అనౌన్స్ చేశారు. కనీసం లుక్ కూడా రివీల్ చెయ్యకుండానే తన భారీ స్టార్ కాస్ట్ ని చూపించేశారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ లో షారూఖ్ ఖాన్ స్టైలిష్ లుక్ లో కొత్తగా కనిపించబోతున్నారు. పఠాన్ సినిమా రేంజ్ కి తగినట్టుగానే అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మూవీ జనవరి 25 2023లో ధియేటర్లోకొస్తోంది.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

సల్మాన్, షారూఖ్ యాక్షన్ కమర్షయిల్ హీరోలని అన్ డౌటెడ్ లీ చెప్పొచ్చు. కానీ రణవీర్ సింగ్ ఎలాంటి ఇమేజ్ ఉన్న హీరో అని అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే రణవీర్ కథతో ట్రావెల్ అవుతారు. ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చెయ్యడానికి రెడీ అంటారు. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న మూవీ జయేష్ భాయ్ జోర్దార్. ఈ సినిమా అనౌన్స్మెంట్ డేట్ ని కూడా అంతే క్రేజీ గా, ఎంటర్ టైనింగ్ గా రిలీజ్ చేశారు రణవీర్. ఈ క్రేజీ మూవీ ఈ సంవత్సరం 13 మే రిలీజ్ అవుతోంది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తన అప్ కమింగ్ మూవీ షంషేరా రిలీజ్ డేట్ ని ఈ హీరోలందరిక కంటే ముందే వీడియోతో ఇంట్రస్టింగ్ గా అనౌన్స్ చేశారు. రొమాటిక్ మూవీస్ నుంచి యాక్షన్ టర్న్ తీసుకున్న రణబీర్.. కరమ్ సే డెకాయిత్, ధరమ్ సే ఆజాద్.. అనే ఇంటెన్స్ డైలాగ్స్ తో సినిమా డెప్త్ ని ఇన్ డైరెక్ట్ గానే చెబుతున్నాడు. సంజయ్ దత్, వాణికపూర్, లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ షంషేరా ఈ సంవత్సరం జులై 22న ధియేటరోకొస్తోంది.