Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

సినిమా ఇండస్ట్రీలో రూల్ మారుతోంది.. రూలింగ్ మారుతోంది. హీరో సెంట్రిక్ సినిమాగా ఉన్న ఒకప్పటి ఇండస్ట్రీని ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆక్యుపై చేస్తున్నారు. అంతేకాదు.. కలెక్షన్లలో..

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

Bollywood Heroins

Bollywood Heroins: సినిమా ఇండస్ట్రీలో రూల్ మారుతోంది.. రూలింగ్ మారుతోంది. హీరో సెంట్రిక్ సినిమాగా ఉన్న ఒకప్పటి ఇండస్ట్రీని ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆక్యుపై చేస్తున్నారు. అంతేకాదు.. కలెక్షన్లలో, క్రేజ్ లో హీరోలకు ధీటుగా ప్యార్లల్ గా సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పటిలా హీరో సినిమాలో అప్పుడప్పుడు కనిపించడం కాకుండా.. సోలో పర్ ఫామెన్స్ తో సినిమా ఇండస్ట్రీలో 50 పర్సెంట్ రిజర్వేషన్ సాధించేస్తున్నారు.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

ఏదో సినిమాలో అప్పుడప్పుడు కనిపించే రోల్స్ కాదు.. సినిమా మొత్తం తమ మీదనే నడిపిస్తున్నారు హీరోయిన్లు. సౌత్ కంటే.. నార్త్ లో హీరోయిన్లకు ఇండివిడ్యువల్ రికగ్నిషన్, మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ స్టార్ హీరోయిన్లు.. సౌత్ లో కొంతమంది హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా తన క్రేజ్ ని, మార్కెట్ ని మరోసారి చూపించింది స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్. శకున్ బత్రా డైరెక్షన్లో చేసిన గెహరాయియా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. దీపికా ముందుండి సినిమాని సక్సెస్ చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా దీపికా లోని యాక్టింగ్ టాలెంట్ ని మరోసారి చూపించింది.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

అంతేకాదు.. ఇప్పటికే విమెన్ సెంట్రిక్ మూవీస్.. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ తో తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకుంది. లేటెస్ట్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ద్రౌపది సినిమాని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తానని అనౌన్స్ చేసింది. దీపికా పదుకోన్ కి బాలీవుడ్ లో స్టామినా ఉంది కాబట్టే.. పాన్ ఇండియా మూవీగా నాగాశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్.కె లో హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాకి 15 కోట్లు తీసుకునే దీపికా పదుకోన్ కి.. తమ సినిమాని బాలీవుడ్ లో పుల్ చెయ్యగల కెపాసిటీ ఉందని, సినిమాకి యాడెడ్ ఎట్రాక్షన్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. సీనియర్ హీరోయిన్లకు చుక్కలు చూపిస్తోంది ఆలియా భట్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గంగూభాయ్ తో తన లోని మరో షేడ్ చూపించింది ఆలియా. ఇప్పటి వరకూ క్యూట్ గా కనిపించిన ఆలియా సోలో పర్ ఫామెన్స్ తో బాలీవుడ్ జనాన్ని సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు.. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఆలియా మూవీ.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

ఎగ్జిస్టింగ్ స్టార్ హీరోయిన్లతో పోటీ పడుతూ.. హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకుంటోంది ఆలియా. అంతేకాదు.. విమెన్ సెంట్రిక్ సినిమాలతో తన మార్కెట్ ని కూడా పెంచుకుంటోంది. గంగూభాయ్ ని తెలుగులో కూడా రిలీజ్ చేసిన ఆలియా.. ఇక్కడ కూడా తన ప్రజెన్స్ ని చూపించింది. అంతేకాదు.. ఇంత క్రేజ్, పాపులారిటీ ఉంది కాబట్టే.. ట్రిపుల్ఆర్ మూవీతో పాటు.. ఎన్టీఆర్ తో మరో సినిమా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది.

Heroins Swim Shoot: అసలే హాట్ లేడీస్.. ఆపై స్విమ్ సూట్స్.. కుర్రాళ్లలో అలజడి!

బాలీవుడ్ హీరోలను అస్సలు పట్టించుకోని కంగనా.. సెపరేట్ గా తన మార్కెట్ ని ఎప్పుడో క్రియేట్ చేసుకుంది. వరసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తో టాప్ హీరోలతో ఎప్పటి నుంచో పోటీపడుతోంది. హిస్టారికల్, హై బడ్జెట్ మూవీస్ లో కూడా హీరోలతో పోటీపడుతూ తన స్టామినా చూపిస్తోంది. కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టేసి.. అన్నీ విమెన్ సెంట్రిక్ స్టోరీస్ చేస్తూ.. మార్కెట్ ని స్టేబుల్ చేసుకుంటోంది ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.

Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు!

కత్రినా కైఫ్ కూడా ఇన్నేళ్ల కెరీర్ లో బాలీవుడ్ మార్కెట్ ని గ్రాబ్ చెయ్యగలిగింది. డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ.. ఇంకా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. ఈమధ్యనే ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్న కత్రినాకైఫ్ ప్యార్లల్ గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఇక నా సినిమాల్లో స్టార్ హీరోలెవరూ నటించరు అని పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇచ్చిన తాప్సీ.. హీరోని పక్కన పెట్టేసి తనే హీరోయిజం చూపిస్తోంది. స్పోర్ట్స్, థ్రిల్లర్, యాక్షన్, ఆంథాలజీ ఇలా సాలిడ్ సినిమాలతో బాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ చేస్తోంది. ఓటీటీ, ధియేటర్ ఇలా ఏ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా.. కలెక్షన్లతో తన సత్తా చూపిస్తోంది తాప్సీ.