Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

ఒకప్పుడు ఏరికోరి అడిగినా ఊహూ అన్నారు బాలీవుడ్ హీరోయిన్స్. ఇప్పుడు ఊ అంటున్నారు. ఓ అడుగు ముందుకేసి వాళ్లే మన తెలుగు హీరోలతో నటించేందుకు సిగ్నల్స్ ఇస్తున్నారు.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

Bollywood Heroins

Bollywood Heroins: ఒకప్పుడు ఏరికోరి అడిగినా ఊహూ అన్నారు బాలీవుడ్ హీరోయిన్స్. ఇప్పుడు ఊ అంటున్నారు. ఓ అడుగు ముందుకేసి వాళ్లే మన తెలుగు హీరోలతో నటించేందుకు సిగ్నల్స్ ఇస్తున్నారు. బాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ దీపికా పదుకోణె రీసెంట్ గా మన తెలుగు హీరోలపై మనసు పడింది.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి మారిపోయింది. దాంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తెలుగు స్టార్స్ తో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మార్కెట్ ని పెంచుకోడానికి వరసపెట్టి టాలీవుడ్ బాట పట్టారు. వాళ్లలో జాన్వీ కపూర్, అనన్యపాండే, అలాయా భట్ ఉన్నారు. రీసెంట్ గా దీపికా పదుకొణె ఆ లిస్ట్ లో చేరింది. బేసిక్ గా దీపికా పడుకోణె ఫస్ట్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినిమా ఐశ్వర్యతోనే అయినా.. బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాప్ స్టార్ అయ్యింది. ప్రస్తుతం దీపికా నటించిన గెహ్రియాన్ ఓటిటిలో రిలీజ్ అయ్యింది.

Bheemla Nayak: హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అనౌన్స్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

గెహ్రియాన్ ప్రమోషన్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది దీపికా. ఆ ప్రమోషన్ లో సౌత్ ఇండియా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలిపింది. త్రిబుల్ ఆర్ లో కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ దీపికా పదుకొణే ను బాగా ఆకట్టుకుంది. అలాగే పుష్పలో బన్నీ నటన కూడా తనను ఇంప్రెస్ చేయడంతో ఆ ఇద్దరు హీరోలతో నటించాలనే కోరికను బయటపెట్టింది. ఆ ఇద్దరిలో ఎన్టీఆర్ తో ఫస్ట్ నటించాలని ఉందని ఎగ్జైట్ అయ్యింది.

Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

గతంలో ఫైండింగ్ ఫన్నీ ప్రమోషన్ లో సౌత్ ఇండియాలో సినిమాలు చేసే తీరిక లేదని చెప్పకనే చెప్పిన దీపికా, ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కె సినిమాలో నటిస్తోంది. అప్పుడు తనకు మహేశ్ బాబు ఇష్టమని చెప్పిన దీపికా ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై మనసు పారేసుకుంది. ప్రస్థుతం తారక్ కొరటాలతో ఎన్టీఆర్ 30 అలియాభట్ తో చేస్తున్నాడు. బన్నీ పుష్ప 2 రష్మికతో చేస్తున్నాడు వీళ్ల లైనప్లో చాలా సినిమాలే ఉన్నాయి. మరి ఏ సినిమాతో దీపిక ను హీరోయిన్ గా సెట్ చేసుకుంటారో వేచి చూడాలి.

RRR: ట్రిపుల్‌ఆర్‌కు మరో సమస్య.. రిలీజ్ డేట్‌పై అనుమానాలు!

కాగా.. బాలీవుడ్ హీరోయిన్స్ ఇలా మన హీరోలతో నటించాలని ఉందని చెప్పడం.. తెలుగు సినిమాలలో అవకాశం వస్తే వెంటనే ఒకే చెప్పడం కూడా ఒక స్ట్రాటజీగానే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉత్తరాది ప్రేక్షకులు మన సినిమాలను.. మన హీరోలను ఇష్టపడుతున్నారు. రొట్టకొట్టుడు బాలీవుడ్ సినిమాల కన్నా మన సినిమాలకే ఇప్పుడు అక్కడ భారీ డిమాండ్ ఉంది. అందుకే ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కొద్దీ నార్త్ హీరోయిన్స్ ఇలా ఓపెన్ గానే మన హీరోల గురించి చెప్పేస్తున్నారు. మన సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.