Bheemla Nayak: హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అనౌన్స్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

ఏపీలో తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలపైన మీటింగ్ సక్సెస్ అయ్యింది. థియేటర్లో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసే యోచనలో ఉంది ఏపి ప్రభుత్వం. ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రిలీజ్ పక్కా..

Bheemla Nayak: హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అనౌన్స్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

Bheemla Nayak

Bheemla Nayak: ఏపీలో తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలపైన మీటింగ్ సక్సెస్ అయ్యింది. థియేటర్లో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసే యోచనలో ఉంది ఏపి ప్రభుత్వం. ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రిలీజ్ పక్కా అనుకుంటున్న ఫాన్స్ కు రిలీజ్ డేట్ రివీల్ చేయకుండా, మరో ఇంట్రెస్టింగ్ అప్ డేటిచ్చాడు ఆ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి.

Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని డేస్ కౌంట్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందా, ఏప్రిల్ ఫస్ట్ న రిలీజ్ అవుతుందా అని క్లారిటీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. భీమ్లానాయక్ ప్రొడ్యూసర్ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ సేమ్ డేట్ కే రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చాడు. దాంతో పవన్ కళ్యాన్ కు నార్త్ లో క్రేజ్ పెరుగుతుందని ఆనంద పడుతున్నా.. ఒక డౌట్ మాత్రం ఫాన్స్ లో కంగారు రేపుతోంది.

Malaika Arora: 48 ఏళ్ల భామ.. ఇంకా హాట్ బ్యూటీనే!

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు జాన్ అబ్రహమ్. హిందీ రీమేక్ వెర్షన్ లో జాన్ అబ్రహమ్, అర్జున్ కపూర్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా మిషన్ మంగల్ డైరెక్టర్ జగన్ శక్తి తెరకెక్కిస్తున్నాడు. అదే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ భీమ్లానాయక్. ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, రానా మెయిన్ లీడ్ లో చేస్తున్నారు. ఈ సినమా తెలుగులో డైరెక్ట్ రిలీజ్ రోజే హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

మరి సేమ్ స్టోరీతో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే రీమేక్ వెర్షన్ పై దెబ్బ పడుతుంది. సో భీమ్లానాయక్ డబ్బింగ్ రిలీజ్ చేయకుండా జాన్ అబ్రహమ్ టీమ్ అడ్డు పడుతుందా? అనే డౌట్ కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను వెంటాడుతుంది. రీసెంట్ గా అలా వైకుంఠ పురంలో విషయంలోనూ ఇలాగే జరిగింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక కూడా అలా వైకుంఠపురం హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదలను అడ్డకున్నారు. ఇప్పుడా సీన్ భీమ్లానాయక్ విషయంలో రిపీట్ అయితే ఎలా? అని కంగారు పడుతున్నారు పవన్ ఫాన్స్.