Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఫస్ట్ సూపర్ స్టార్ రజినీకాంతే.. ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో బిగ్ సక్సెస్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్న యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి..

Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

Rajinikanth

Rajinikanth: సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఫస్ట్ సూపర్ స్టార్ రజినీకాంతే.. ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో బిగ్ సక్సెస్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్న యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవాను ఆ రేంజ్ లో చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు యంగ్ డైరెక్టర్స్. పిజ్జా ఎంట్రీతోనే హిట్ కొట్టిన కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ సినిమా చూసి, కార్తీక్ సుబ్బరాజ్ ను నమ్మి పేట డైరెక్ట్ చేసే అవకాశమిచ్చాడు రజనీకాంత్. కాలా కబాలి అంత ఫ్లాప్ కాకపోయినా బాక్సాఫీస్ ముందు సక్సెస్ ను ఇవ్వలేకపోయాడు కార్తీక్ సుబ్బరాజ్.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

ఏ ఆర్ మురుగ దాస్ అయినా దర్భార్ ను హాండిల్ చేసి, బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్ట్రర్ హిట్ ఇస్తాడనుకుంటే భారీ ఫ్లాప్ నే మిగిల్చాడు. తర్వాత భారీ యాక్షన్ సినిమాను ఢీల్ చేస్తాడని కోలివుడ్ డైరెక్టర్ శివకు అన్నాత్తే అవకాశమిస్తే యావరేజ్ సక్సెస్ ను కూడా అందుకోలేదు. తెలుగులో పెద్దన్నగా వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలా వరసగా ఫ్లాప్ లతో ఉన్న రజనీకాంత్ దృష్టి ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ పై పడింది.

Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ్ ఇండస్ట్రీలో 2018లో కొలనువ్వా కోకిల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రైటర్ కమ్ డైరెక్టర్. ఈయన చేసిన ఫస్ట్ సినిమా సూపర్ హిట్, బెస్ట్ స్క్రీన్ ప్లే తో పాటు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత శివకార్తికేయన్ తో చేసిన వరుణ్ డాక్టర్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా వరుణ్ డాక్టర్ కు మంచి ఆదరణ వచ్చింది.

RGV: మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ జగన్.. ఆగని ఆర్జీవీ ట్వీట్ల పర్వం!

నెల్సన్ దిలీప్ కుమార్ కెరీర్ లో మూడో సినిమా బీస్ట్ తమిళ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రజనీ దృష్టిలో పడింది. సో నెల్సన్ దిలీప్ కుమార్ కెరీర్లో నాలుగో సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమాగా సెట్ అయ్యింది. ఫస్ట్ లుక్ టెస్ట్ ఇచ్చేశాడు. ఈ డైరెక్టర్, తనకు సూపర్ డూపర్ హిట్ ఇస్తాడనే హోప్ తో ఉన్నాడు రజనీకాంత్. అదే ప్రూవ్ చేసుకుంటానంటున్నాడు నెల్సన్ దిలీప్.