Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కి చెక్ పెట్టేసింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు..

Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

Payal Ghosh

Payal Ghosh: టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కి చెక్ పెట్టేసింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు సైడ్ ఇచ్చేయ్యాల్సిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా వస్తుందని రెండు వారాలు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయకపోవడమే మంచిదని కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారంటే టాలీవుడ్ సత్తా గురించి ఇంతకిమించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ పరిస్థితి కూడా అంతే.

RGV: మెగా సూపర్ డూపర్ ఓమెగా స్టార్ జగన్.. ఆగని ఆర్జీవీ ట్వీట్ల పర్వం!

టాలీవుడ్ స్టార్స్ తో నటించేందుకు బాలీవుడ్ హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాతో దేశవ్యాప్తంగా పేరు వచ్చే అవకాశం ఉండడంతో టాలీవుడ్ సినిమాలో నటించాలని.. తెలుగు స్టార్ హీరోలతో నటించాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్స్ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఎన్టీఆర్ తో నటించాలని ఉందని తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ కోట్ చేస్తూ మరో నటి నేనెప్పుడో చెప్పా ఇది అంటూ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.

Manchu Vishnu : మోహన్‌బాబు-మంత్రి పేర్ని నాని భేటీపై ట్వీట్‌ ను ఎడిట్ చేసిన మంచు విష్ణు

ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో నటించిన పాయల్ ఘోష్ ఇప్పుడు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ సినిమా కూడా చేసిన పాయల్ ఘోష్ ఆ మధ్య ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా ఏదో ఒక రోజు ఇండియా సినిమాను శాసిస్తుందని కామెంట్స్ చేసింది. అప్పుడు ఆమెపై ఉత్తరాది నుండి విమర్శలు కనిపించాయి. అయితే.. ఇప్పుడు దీపికా పదుకొనె ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చేసిన కామెంట్స్ ను కోట్ చేసిన పాయల్.. నేనెప్పుడో చెప్పా ఎన్టీఆర్ నటన, టాలీవుడ్ సత్తా గురించి.. ఇప్పుడు అదే నిజమైంది. బాలీవుడ్ ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేను చెప్పిన కామెంట్స్ ఎప్పుడూ తప్పు కాదని పాయల్ ట్వీట్ చేసింది.