Manchu Vishnu : మోహన్‌బాబు-మంత్రి పేర్ని నాని భేటీపై ట్వీట్‌ ను ఎడిట్ చేసిన మంచు విష్ణు

ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్‌బాబును కలిసిన సందర్భంగా మొదట ట్వీట్‌ చేసిన మా అధ్యక్షులు మంచు విష్ణు.. తర్వాత దాన్ని ఎడిట్‌ చేశారు.

Manchu Vishnu : మోహన్‌బాబు-మంత్రి పేర్ని నాని భేటీపై ట్వీట్‌ ను ఎడిట్ చేసిన మంచు విష్ణు

Vishnu Tweet Edit

Manchu Vishnu edited a tweet : టాలీవుడ్‌లో సినిమాలే కాదు.. ఇండస్ట్రీ వాళ్లు చేసే ట్వీట్లు కూడా ఎడిట్‌ అవుతున్నాయి. ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్‌బాబును కలిసిన సందర్భంగా మొదట ట్వీట్‌ చేసిన మా అధ్యక్షులు మంచు విష్ణు.. తర్వాత దాన్ని ఎడిట్‌ చేశారు. ముందుగా మీకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని.. సినీ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్‌ల గురించి అప్‌డేట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చర్చలు జరిపితే.. మోహన్‌బాబు ఇంటికి మంత్రి వెళ్లడంపై హాట్‌టాపిక్‌ నడిచింది. మోహన్‌బాబుకు మెగా మీటింగ్‌ గురించి వివరించాల్సిన అవసరం ఏం వచ్చిందనే చర్చ జరిగింది. ఇదే సమయంలో మంచు విష్ణు తన ట్వీట్‌ నుంచి అప్‌డేట్‌ మ్యాటర్‌ను తొలగించేశారు. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మంత్రి పేర్ని నాని రాకపై కొద్దిసేపటి క్రితం పెట్టిన పోస్ట్ ను మంచు విష్ణు ఎడిట్ చేశారు. ఆ పోస్ట్ లో టిక్కెట్ ధరలు, ఏపీ ప్రభుత్వ ప్లాన్ లు తెలియ చేసినందుకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. టిక్కెట్ ధరలపై మీ చొరవకు ధన్యవాదాలు. పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వ ప్లాన్ లపై మాకు అప్ డేట్ చేసినందుకు ధన్యావాదాలు. టీఎఫ్ఐ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. అయితే ఆ పోస్టును మంచు విష్ణు ఎడిట్ చేశారు. తాజాగా మంచు విష్ణు మరో ట్వీట్ పోస్టు చేశారు. ‘మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. TFI ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి కలిశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లిన నాని.. ఆయనను కలిశారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపై పేర్ని నాని చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడిందనుకుంటున్న సమయంలో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.

మెగా మీటింగ్ సక్సెస్ అని ప్రకటించిన వేళ…మరిన్ని మీటింగ్స్ సీఎంతో సినీ పెద్దల మీటింగ్ పై కౌంటర్స్ తో సినీ ఇండస్ట్రీ మరోసారి హాట్ హాట్ గా మారింది. పేర్నినాని పర్సనల్ మీటింగ్, పొలిటికల్ కామెంట్స్, సెటైరికల్ ట్వీట్స్ తో ఫిల్మ్ నగర్ లో ఏం జరుగుతుందోనన్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నిన్న చిరంజీవి టీమ్ సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. నిన్న సీఎం జగన్ తో చిరు టీమ్ మీటింగ్ లో జరిగిన విశేషాలను మోహన్ బాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఇంట్లో దాదాపు 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో నిన్నటి సమావేశంలో చర్చించిన పలు అంశాలను కూడా వివరించినట్లుగా సమాచారం. అయితే దీనిపై మంచు విష్ణు కూడా ట్వీట్ చేశారు.

Assam CM : విద్యార్థినిలు హిజాబ్‌ ధరిస్తే..వారికి పాఠాలు అర్థమయ్యాయో లేదో టీచర్ కి ఎలా తెలుస్తుంది?

నిన్న తెలుగు సినిమా ప్రముఖులతో ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ, ఐ అండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సినిమా టికెట్లు, థియేటర్లలో షోలపై ఏపీ ప్రభుత్వానికి కమిటీ నివేదికను అందజేసింది. చిరు టీమ్‌తో మీటింగ్ సందర్భంగా ప్రభుత్వం.. కమిటీ ప్రతిపాదనలను వారి ముందు ఉంచింది. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం, చిరు టీమ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. టికెట్ రేట్లపై కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలలో నాన్‌ ఏసీ టికెట్ మినిమం ధర 40 రూపాయల నుంచి 60రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. ఏసీ టికెట్ కనీస ధర 70నుంచి 100రూపాయలకు పెంచాలని సూచించింది. మున్సిపల్ కార్పొరేషన్, మల్టీప్లెక్స్‌లు, నగర పంచాయితీల్లోనూ టికెట్ల ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేసింది.

CM KCR : మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు స్పెషల్ అలవెన్స్ ఇస్తాం : సీఎం కేసీఆర్

మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదించింది. నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ టికెట్ రూ.20నుంచి రూ.40కి పెంచాలని సూచించింది. నగర పంచాయతీల్లో ఏసీ టికెట్ రూ.50 నుంచి రూ.70కి పెంచాలని కోరింది. నగర పంచాయతీల్లోని మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ట ధర రూ.250గా ప్రతిపాదన చేసింది. అలాగే.. ఏపీలో ఐదు షోల సమయాన్ని కూడా కమిటీ ప్రతిపాదించింది. మొదటి షో ఉదయం 8 నుంచి 11గంటల వరకు. రెండవ షో 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు. మూడవ షో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. నాల్గవ షో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు. ఐదవ షో రాత్రి 8 నుంచి రాత్రి 11గంటల వరకు అని ప్రతిపాదనలు చేసింది.