Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

పాన్ ఇండియా ఫీవర్ సౌత్ ఇండియాలో ప్రతీ హీరోనూ టచ్ చేస్తుంది. పాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్లడానికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రెడీ అయ్యాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ వలిమై తో రంగంలోకి..

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

Valimai Trailer

Valimai: పాన్ ఇండియా ఫీవర్ సౌత్ ఇండియాలో ప్రతీ హీరోనూ టచ్ చేస్తుంది. పాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్లడానికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రెడీ అయ్యాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ వలిమై తో రంగంలోకి దిగుతున్నాడు. ఫిబ్రవరి 24న పాన్ ఇండియా లెవల్ లో థియేటర్లోకి రాబోతున్నాడు. హ్యూజ్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన అజిత్ వలిమై మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో ‘వలిమై’ తో వస్తున్నాడు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రయిలర్ ను రిలీజ్ చేసి, బెస్ట్ విషెస్ అందించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దాంతో తెలుగు ఆడియన్స్ కు, ముఖ్యంగా మహేశ్ బాబు అభిమానులకు ఈ సినిమా పై స్పెషల్ అటెన్షన్ క్రియేట్ అయింది.

DJ Tillu: టిల్లు చుట్టూ భారీ హైప్.. మరి ఫలితం ఎలా ఉంటుందో?!

ఆల్రెడీ తమిళ్ లోనూ, హిందీలోనూ మంచి మార్కెట్ ఉన్న అజిత్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ మార్కెట్ లో తన సత్తా చాటాలనుకుంటున్నాడు. జీ స్టూడియోస్‌, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ కంబైన్డ్ గా ఈ సినిమాను లార్జ్ స్కేల్ నిర్మించారు. హెచ్ వినోద్ ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం. అజిత్ ఫ్యాన్స్ ను సాటిస్ ఫై చేస్తూ అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశామని చెబుతున్నారు మేకర్స్.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

అజిత్ పవర్ ఫుల్ సిబిసిఐడిగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ గుమ్మడి కొండ విలన్ రోల్ పెర్ఫామ్ చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజ సంగీతం అందించాడు. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి అజిత్ కు జోడీగా నటిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని, అన్ని భాషలను కవర్ చేస్తూ, క్యాస్టింగ్ అండ్ టెక్నిషియన్స్ ను సెలక్ట్ చేసుకున్న ఈ సినిమా అజిత్ మార్కెట్ ను ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి.