DJ Tillu: టిల్లు చుట్టూ భారీ హైప్.. మరి ఫలితం ఎలా ఉంటుందో?!

సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా డీజే టిల్లు. ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రయిలర్స్ అన్నీ..

DJ Tillu: టిల్లు చుట్టూ భారీ హైప్.. మరి ఫలితం ఎలా ఉంటుందో?!

Dj Tillu

DJ Tillu: సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా డీజే టిల్లు. ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రయిలర్స్ అన్నీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంబైన్డ్ గా నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కు అమేంజింగ్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ ఫుల్ హోప్ తో ఉన్నారు. ఇప్పుడు డీజే టిల్లు టైటిల్ సాంగ్ మోగుతోంది. దానికి కాసర్ల శ్యామ్ లిరక్స్, రామ్ మిర్యాల టోన్, శ్రీచరణ్ ట్యూన్ క్యాచీగా ఉండటంతో ఆడియన్స్ ను ఈజీగా ఎట్రాక్ట్ చేసింది.

Payal Ghosh: బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ టేక్ చేస్తుందని నేనెప్పుడో చెప్పా.. నటి ట్వీట్ వైరల్!

ట్రైలర్ తో సగం సక్సెస్ అందుకున్నాం మిగతాది థియేటర్ లో చూపిస్తామంటూ సక్సెస్ పై కాన్ఫిడెంట్ తో ఉన్నారు టిల్లు టీమ్. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక లిఫ్ట్ ఇచ్చారు. గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయిన సిద్ధు జొన్నలగడ్డకు ఈ సినిమాకు టికెట్స్ బుక్ అయిపోవడం, థియేట్రికల్ రైట్స్ అమ్మడంతో డీజే టిల్లు చుట్టూ ఒక బజ్ క్రియేట్ అయ్యింది. మరి టిల్లుగాడి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.