RRR: ట్రిపుల్‌ఆర్‌కు మరో సమస్య.. రిలీజ్ డేట్‌పై అనుమానాలు!

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా..

RRR: ట్రిపుల్‌ఆర్‌కు మరో సమస్య.. రిలీజ్ డేట్‌పై అనుమానాలు!

Rrr Movie

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు. ముందు మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు.

Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం.. దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు లేకపోవడంతో మార్చి 25న వచ్చేస్తున్నాం అంటూ ఇప్పటికే మేకర్స్ కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టారు. దీనిని బట్టి చూస్తే మరో నలభై రోజులలో ఆర్ఆర్ఆర్ థియేటర్లకు వచ్చేయనుంది.

Shama Sikander: బోల్డ్‌నెస్‌లో పీక్స్ చూపిస్తున్న షామా!

అయితే ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకి మరో సమస్య ఒకటి ఉందని.. దాని కారణంగానే రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తంచేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరిగ్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే సమయానికి ఒకవైపు విద్యార్థులకు పరీక్షలు.. మరోవైపు ఐపీఎల్ సీజన్ మొదలవుతుందని దీని కారణంగా ఆర్ఆర్ఆర్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

సహజంగానే మార్చి-ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం. దీనికి తోడు ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారం నుండి ఐపీఎల్ క్రికెట్ కూడా మొదలు కానుంది. దీంతో ఇవి రెండూ కలిసి ఆర్ఆర్ఆర్ వసూళ్లపై ప్రభావం చూపుతుందని.. ఈ కారణంగా ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకి ఇది పెద్దగా అడ్డంకిగా మారే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.