Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా డిమాండ్ పెంచేస్తున్నారు. ఆ మాట కొస్తే హీరోతో సమానంగా ఛార్జ్ చేసే వాళ్లూ..

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

Bollywood Heroins: రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా డిమాండ్ పెంచేస్తున్నారు. ఆ మాట కొస్తే హీరోతో సమానంగా ఛార్జ్ చేసే వాళ్లూ లేకపోలేదు. ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నాయన్నది కాదు.. ఉన్న సినిమాలకు ఎంత తీసుకుంటున్నారన్నదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

రెమ్యునరేషన్ డిమాండ్ తో చుక్కలు చూపిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్స్. లక్షల మాట ఎప్పుడో మర్చిపోయి కోట్లకి కోట్లు అందుకుంటున్నారు. వీళ్లు.. హార్డ్ వర్క్ తో నేమ్ ఫేమ్ మాత్రమే కాదు ఎర్నింగ్స్ లోనూ పీక్స్ కు చేరుకుంటున్నారు. వరల్డ్ సినిమాపై మెరుస్తున్న దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా స్కై ఈజ్ పింక్ కి 8కోట్లు ఛార్జ్ చేసింది. అంతేనా 12కోట్ల డీల్ తో జీలే జరా ప్రాజెక్ట్ కు సైన్ చేసింది ప్రియాంక.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

గెహ్రియాన్ సినిమాకు గానూ దీపికా ఫస్ట్ 12కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది కానీ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అనడంతో 15కోట్లను దక్కించుకుంది. ఇక దాదాపు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి రెండు పదులు దాటేసిన కత్రినా ఒక్కో బాలీవుడ్ సినిమాకు 12 కోట్లను వసూలు చేస్తుంది. బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ అనిపించుకున్న కంగనా రనౌత్‌ 20 కోట్లను డిమాండ్ చేస్తుందని పేరున్నా.. 9 కోట్ల దగ్గరే ఆమె ఆగిందని బాలీవుడ్ ట్రేడ్ ఇండస్ట్రీ సమాచారం.

Bollywood Heroins: టాలీవుడ్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఇదీ క్రేజ్ అంటే!

డార్లింగ్ మూవీ కోసం ఆలియా భట్‌ 15 కోట్లు రాబట్టింది. అయితే సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయ్‌ కతియావాడి’, కరణ్ జోహార్ ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ ప్రాజెక్ట్స్ కోసం అలియా తన రెమ్యునరేషన్ తగ్గించుకుంది. నెట్ ఫ్లిక్స్ మూవీ చక్దా ఎక్స్ ప్రెస్ కోసం అనుష్కా శర్మ 8 కోట్ల డీల్ కుదుర్చుకుంది. ఇక 7 కోట్లతో శ్రద్ధా కపూర్‌, 5కోట్లతో తాప్సీ బాలీవుడ్ సినిమాలు చేస్తుంటే.. విద్యాబాలన్‌ మాత్రం రెమ్యునరేషన్ పెంచకుండా 4 కోట్ల దగ్గర ఆగింది.

Bollywood Multi Starer: డబుల్ ధమాకా.. బాలీవుడ్‌లో మల్టీస్టారర్ల హవా!

ప్రభాస్ తో ఆదిపురుశ్ చేస్తోన్న కృతి సనన్‌ 4కోట్ల రేంజ్ లో ఉంది. నార్త్, సౌత్ అనే తేడా ప్రాజెక్ట్స్ చేస్తోన్న కియారా లేటెస్ట్ ‘జగ్‌ జగ్‌ జియో’కు రెండున్నర కోట్లు అందుకుంది. కియారాతో పాటే జాన్వీ కపూర్, సారా అలీఖాన్, దిశాపటానీ, అనన్యపాండే వంటివారు ఒక్కో మూవీకి ఒకటిన్నర నుంచి రెండున్నర కోట్లు రాబడుతున్నారు.