Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

బాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ హడావిడీ పీక్స్ ని టచ్ చేసింది. మాక్సిమమ్ సినిమాలు 2022లోనే ఖర్చీఫ్ వేస్తున్నా.. మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్టులు మాత్రం టార్గెట్ 2023 అంటున్నాయి.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

Bollywood Movies

Bollywood Movies: బాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ హడావిడీ పీక్స్ ని టచ్ చేసింది. మాక్సిమమ్ సినిమాలు 2022లోనే ఖర్చీఫ్ వేస్తున్నా.. మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్టులు మాత్రం టార్గెట్ 2023 అంటున్నాయి. అవును షారుఖ్, సల్మాన్, హృతిక్ బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ 2023లోనే కొత్త డేట్స్ అనౌన్స్ చేశాయి.

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

బాలీవుడ్ బిగ్ మూవీస్ ఒక్కొక్కటిగా డేట్ లాక్ చేసుకుంటున్నాయి. ఇప్పుడా లిస్ట్ లోకి హృతిక్ రోషన్ ఫైటర్ వచ్చి చేరింది. సూపర్ 30 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హృతిక్ రోషన్ విక్రమ్ వేదా రీమేక్ ను ఈ ఇయర్ సెప్టెంబర్ 30న ఫిక్స్ చేసుకున్నాడు. కానీ ఈ రీమేక్ కు ముందే ప్లాన్ చేసిన బడా ప్రాజెక్ట్ ఫైటర్ ను మాత్రం నెక్ట్స్ ఇయర్ విడుదల చేయబోతున్నాడు.

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

ఇండియన్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఫైటర్ ను సిద్ధర్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. నెక్ట్స్ ఇయర్ సెప్టెంబర్ 28న రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకోన్ హీరోయిన్ కాగా.. అనిల్ కపూర్ కీ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజానికి 2023 జనవరి 26కు ఫైటర్ అనుకున్నారు కానీ.. సేమ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న షారుఖ్ ఫిల్మ్ పఠాన్ ఆ స్పేస్ ను లాక్ చేసింది.

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

2023 జనవరి 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది పఠాన్. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చూపించబోతున్నాడు షారుఖ్ ఖాన్. వార్ ఫేం సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో షారుఖ్ తో పాటూ దీపికా పదుకునే, జాన్ అబ్రహం నటిస్తున్నారు. షారుఖ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న ఈ హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో సల్మాన్ గెస్ట్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నాడు.

Bollywood Releases: కదిలిన బాలీవుడ్.. ఒక్కొక్కరూ రిలీజ్ డేట్ అనౌన్స్!

2022లో కూడా సల్మాన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నాడు. ఈ ఏడాది రంజాన్ కనుకున్న సల్మాన్, పూజా హెగ్డేల కభీ ఈద్ కభీ దివాళి.. భాయిజాన్ గా పేరు మార్చుకొని.. డిసెంబర్ 30న వచ్చేలా కనిపిస్తుంది. కానీ దానికి మించి టైగర్ ఫ్రాంచైస్ లో రాబోతున్న సినిమా గురించే సల్లూభాయ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సల్మాన్ మోస్ట్ అవైటైడ్ మూవీ టైగర్ 3 కూడా.. 2023 ఏప్రిల్ 11న ఈద్ పండక్కి డేట్ ఫిక్స్ చేసుకుంది.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ 2023 జనవరి 12 సంక్రాంతి పండక్కి రానుంది. రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తోన్న రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఫిక్సయింది.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

వచ్చే ఏడాది రణ్బీర్ మూడు సినిమాలతో మ్యాజిక్ చేయబోతున్నాడు. రణ్ బీర్, శ్రద్ధా కపుల్ గా లవ్ రంజన్ తెరకెక్కిస్తున్న ఎపిక్ లవ్ స్టోరీ నెక్ట్స్ ఇయర్ మార్చ్ 8న రాబోతుండగా.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ నటిస్తున్న యానిమల్ ఆగస్ట్ 11ను బుక్ చేసుకుంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా 2023లోనే థియేటర్స్ కి రానుంది.