Love Couples: పెళ్లిదేముంది అదే అవుతుంది.. రిలేషన్‌లో ఉన్నాం కదా!

పెళ్ళికేం తొందర అంటున్నారు హీరోయిన్లు. హీరోయిన్లకు స్క్రీన్ లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి.. ఛాన్సులు ఉన్నప్పుడే సినిమాలు చేసి పెళ్లిసంగతి తర్వాత అంటున్నారు. అందుకే పెళ్లి మాటెత్తకుండా

Love Couples: పెళ్లిదేముంది అదే అవుతుంది.. రిలేషన్‌లో ఉన్నాం కదా!

Love Couples

Love Couples: పెళ్ళికేం తొందర అంటున్నారు హీరోయిన్లు. హీరోయిన్లకు స్క్రీన్ లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి.. ఛాన్సులు ఉన్నప్పుడే సినిమాలు చేసి పెళ్లిసంగతి తర్వాత అంటున్నారు. అందుకే పెళ్లి మాటెత్తకుండా, లవ్ లైఫ్ ని లీడ్ చేస్తూ కూడా.. కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నారు ఈ హీరోయిన్లు. రి లేషన్లో కమిట్ అయ్యి ఉన్నా కూడా.. పెళ్లి మాత్రం ఇప్పుడే కాదంటున్నారు ఈ భామలు. ప్రేమలో మునిగితేలుతున్నా కూడా.. పనే ముఖ్యం అంటున్నారు.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

పెళ్లి దేముంది ఎప్పుడైనా చేస్కోవచ్చు.. కానీ కెరీర్ అలా కాదు కదా.. లైమ్ లైట్లో ఉన్నప్పుడే.. సినిమాలు చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు హీరోయిన్లు. అందుకే పెళ్లిని హోల్డ్ లో పెళ్లి.. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సౌత్ టూ నార్త్ వరసగా సినిమాలు చేస్తున్న రష్మిక కూడా ఇలాగే అంటోంది. పెళ్లికి ఇంకా చాల టైముంది. అసలు ఇప్పుడే పెళ్లెందుకు..? చేస్కోవాలనిపించినప్పుడు చేస్కోవచ్చు. అయినా వీటన్నింటి గురించి ఆలోచించే టైమ్ లేదంటోంది. హిందీలో 2, సౌత్ లో 3 సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ మీదే ఫోకస్ చేస్తోంది శ్రీవల్లి.

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

తన బర్త్ డే కి బాయ్ ప్రెండ్ జక్కీ భగ్నానీ ని పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లి మీద ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రిలేషన్ లో ఉన్నా కూడా.. పెళ్లి మాత్రం ఇప్పుడే కాదని, అసలు పెళ్లిగురించి ఆలోచించే తీరిక లేదని, చేతినిండా సినిమాలతో సౌత్, నార్త్ లో ఫుల్ బిజీగా ఉన్నా నంటోంది. పెళ్లి మాత్రం ఎప్పుడు చేస్కోవాలని పిస్తే అప్పుడే చేస్కుంటానని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

శృతిహాసన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రొఫెషనల్ గా బిజీ అవుతూనే.. అటు పర్సనల్ గా కూడా ఫుల్ గా ఎంగేజ్ అయిపోయింది. తను ప్రజెంట్ రిలేషన్ లో ఉన్న శంతనుతో టైమ్ స్పెండ్ చేస్తున్న ఫోటోలు, వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ కి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఈముద్దుగుమ్మ. అయితే పెళ్లి గురించి ఇప్పుడే ఏం ఆలోచించడం లేదని, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పెళ్ళి చేసేసుకుంటా అంటూ తేల్చేసింది శృతి హాసన్. ప్రజెంట్ శృతి ప్రభాస్, బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ లైఫ్ స్టార్ట్ చేసింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్‌ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిపోయిన ఈ జంట.. పెళ్లిని మాత్రం హోల్డ్ లో ఉంచారు. ప్రస్తుతం కెరీర్ లో డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్నామని, ఆ తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు ఈ జంట.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

మరో హీరోయిన్ తాప్సీ కూడా తన పెళ్లి మీద చాలా క్లియర్ గా ఉన్నానంటోంది. ఫారెన్ బ్యాడ్మింటన్ కోచ్ మథయాస్ బోతో రిలేషన్ లో ఉన్న తాప్సీ.. పెళ్లి గురించి మా ఇంట్లో కంగారు పడుతున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్నా కాబట్టి.. సంవత్సరానికి కనీసం రెండు సినిమా ఛాన్సులు కూడా రాకపోతే అప్పుడే పెళ్లిగురించి ఆలోచిస్తా అని ఫ్యాన్స్ కి చెప్పేసింది తాప్సీ.

Heroins Swim Shoot: అసలే హాట్ లేడీస్.. ఆపై స్విమ్ సూట్స్.. కుర్రాళ్లలో అలజడి!

ఆలియా భట్ కూడా దాదాపు ఇదే స్టేజ్ లో ఉంది. రణబీర్ సింగ్ తో లవ్ లో ఉన్న ఆలియా భట్.. ప్రజెంట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అని అందరూ ఇష్టంవచ్చినట్టు వార్తలు రాస్తున్నా కూడా.. అస్సలు పట్టించుకోవట్లేదు ఆలియా. బాలీవుడ్ టూ టాలీవుడ్.. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ భామ. ప్రజెంట్ ఆలియా.. షంషేరా, ట్రిపుల్ఆర్, గంగూభాయ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యింది.

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

సిద్దార్ద్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న కియారా అద్వానీ కూడా పెళ్లిదేముంది తర్వాత చేస్కోవచ్చంటోంది. ఇద్దరూ కలిసి పార్టీలకు, వెకేషన్లకు వెళ్తున్నా కూడా పెళ్లి మాటమాత్రం ఎత్తడం లేదు. షేర్షా హిట్ తో సక్సెస్ లో ఉన్న సిద్దార్ద్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే.. భూల్ భులయ్యా, జుగ్ జుగ్ జియో, ఆదిపురుష్ సినిమాలతో పాటు.. రామ్ చరణ్ తో వరసగా సినిమాలు లైన్లో పెట్టింది కియారా. ఇలా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ..పెళ్లి ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుందామని ఫిక్స్ అవుతున్నారు ఈ న్యూ జనరేషన్ హీరోయిన్లు.