Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

హీరోయిన్లు ఒకప్పటి గ్లామర్ డాల్స్ కాదు.. ఒకవైపు బ్యూటి ఫుల్ రోల్స్ చేస్తూనే పర్ ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. అందుకే వాళ్లకంటూ ఓ మార్కెట్, స్పెషల్ ఫాన్ బేస్, స్క్రీన్ స్పేస్..

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

Star Heroins

Star Heroins: హీరోయిన్లు ఒకప్పటి గ్లామర్ డాల్స్ కాదు.. ఒకవైపు బ్యూటి ఫుల్ రోల్స్ చేస్తూనే పర్ ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. అందుకే వాళ్లకంటూ ఓ మార్కెట్, స్పెషల్ ఫాన్ బేస్, స్క్రీన్ స్పేస్ సంపాదించుకుని హీరోలతో పోటీకొస్తున్నారు. అంతే కాదు హీరోలు కూడా సినిమాలో సోలో పర్ ఫామెన్స్ కాకుండా హీరోయిన్స్ కి స్పేస్ ఇస్తున్నారు. హీరోయిన్ల క్యారెక్టర్స్ మారిపోతున్నాయి. ఏదో 4 పాటలు, 5,6 సీన్లు చేసే రోజులు పోయాయి. హీరోలతో సమానంగా పర్ ఫామెన్స్ తో పోటీపడుతూ సినిమాలో మంచి స్క్రీన్ స్పేస్ సంపాదిస్తున్నారు. అంతేకాదు.. తమకున్న క్రేజ్ తోసినిమాల మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

లేటెస్ట్ గా రష్మిక మందాన చేస్తున్న సినిమాల్లో హీరోలతో పాటు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సంపాదిస్తోంది. శర్వానంద్ తో చేస్తున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాలో స్పేస్ ఎక్కువ తీసుకుని హైలెట్ అవుతోంది. ఎప్పుడూ గ్లామరస్ గా ఉండే క్యారెక్టర్లు కాకుండా సమ్ థింగ్ డిఫరెంట్ పర్ ఫామెన్స్ ఓరియంటెగ్ క్యారెక్టర్లు చేసి ఆడియనస్ ని తమవైపుకు తిప్పుకుంటున్నారు హీరోయిన్లు.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తర్వాత సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రష్మికనే కనిపిస్తుంది. అంత స్క్రీన్ స్పేస్ తో పాటు.. తన పర్ ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేసి.. సినిమా మీద క్రేజ్ మరింత పెంచింది. పుష్పలో హీరో హీరోయిన్లెంతో.. ఆ సినిమాకి మరింత క్రేజ్ సంపాదించి పెట్టింది అన్ డౌటెడ్ లీ సమంత. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆడియన్స్ ని తన యాక్టింగ్ తో పుల్ చెయ్యగలిగిన సత్తా ఉన్న హీరోయిన్ సమంత. ఒక్క స్పెషల్ సాంగ్ తో సినిమా గ్రాఫ్ నే మార్చేసిన సమంత.. అందరూ ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఈ సినిమా సక్సెస్ కి రీజనైంది.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

అంతకుముందు వరకూ పెద్దగా పర్ పామెన్స్ రోల్స్ చెయ్యని పూజాహెగ్డే.. సడెన్ సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యే రేంజ్ కి వెళ్లిపోయింది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరో పూజాహెగ్డే యేమో అనిపిస్తుంది. అంత స్క్రీన్ స్పేస్ తోపాటు.. తన యాక్టింగ్ తో అన్ డౌటెడ్ లీ ఆడియన్స్ ని ధియేటర్లకు పుల్ చేసింది. వరస పెట్టిసినిమాలు చెయ్యడమే కాకుండా పూజా ఉంటే చాలు.. ధియేటర్లకు జనాలు వస్తారనే క్రేజ్ సంపాదించుకుంది. అలవైకుంఠపురంలో కూడా బన్నీని మ్యాచ్ చేసే పర్ ఫామెన్స్ తో అదరగొట్టింది. మరోసారి త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేస్తోంది. అంతే కాదు ప్రభాస్ రాధేశ్యామ్ లో ప్యాన్ ఇండియా స్టార్ తో సమానంగా పవర్ ఫుల్ రోల్ చేస్తోంది.