Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన..

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Mohan Babu (1)

Updated On : February 13, 2022 / 7:17 PM IST

Mohan Babu: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలతో పాటుగా రాజకీయ అంశాలను ప్రస్తావించారు. తన ఇంటికి మంత్రి పేర్ని నాని వస్తే పలు రకాలుగా ప్రచారం చేసిన అంశాన్ని కూడా వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని.. తానే మంత్రిని తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని కోరారని చెప్పుకొచ్చారు.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

మంత్రి నానితో జరిగిన సమావేశంపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించిన మోహన్ బాబు.. నానితో సినీ పరిశ్రమపై జరిగిన సమావేశం గురించి ఎలాంటి వాకబూ చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా ఎంతో మంది ప్రముఖులు తన ఇంటికి అతిథులుగా వస్తారని.. మంత్రి తన ఇంటికి రావడంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని హితవు పలికారు. జగన్, చంద్రబాబు తనకు ఇద్దరూ బంధువులేనన్న మోహన్ బాబు.. ఆ ఇద్దరి కోసం ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని స్పష్టం చేశారు.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

చంద్రబాబుకు గతంలో ఎన్నికల ప్రచారం చేశానని.. 2019 ఎన్నికల్లో జగన్ కు ప్రచారం చేశానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇకపై సినిమాలు, విద్యాసంస్థలు తప్ప ఎలాంటి ఆలోచనా లేదని స్పష్టం చేశారు. ఇకపై మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం కూడా తనకు లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. అయితే.. మంత్రి నానీతో భేటీ తర్వాత మంచు విష్ణు చేసిన ట్వీట్స్ లో హీరోలు సీఎంతో భేటీ గురించి మంత్రి నానీ తమకు వివరించారని వెల్లడించి తర్వాత మళ్ళీ ఆ ట్వీట్స్ డిలీట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా అసలు ఆ ప్రస్తావనే రాలేదని చెప్పుకొచ్చారు.