Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

మాస్ సక్సెస్ కోసం యాక్షన్ ఫీట్స్ చేస్తున్న సౌత్ ఇండియన్ హీరో విశాల్. సినిమాల్లో యాక్షన్ ఎలా ఉన్నా, షూటింగ్ లో యాక్షన్ చేస్తుంటే గాయాలు మాత్రం కామన్ అయిపోతున్నాయి.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

Vishal

Vishal: మాస్ సక్సెస్ కోసం యాక్షన్ ఫీట్స్ చేస్తున్న సౌత్ ఇండియన్ హీరో విశాల్. సినిమాల్లో యాక్షన్ ఎలా ఉన్నా, షూటింగ్ లో యాక్షన్ చేస్తుంటే గాయాలు మాత్రం కామన్ అయిపోతున్నాయి. ఇంత కష్టపడ్డా సినిమాలైనా హిట్ అవుతున్నాయా అంటే, బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ ఎంత బాగా వస్తే, సినిమా అంత బాగా వస్తుందని బిలీవ్ చేసే హీరోల్లో విశాల్ ముందు వరసలో ఉంటాడు. అందుకే డూప్ లు లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఇప్పటికే ఎన్నో సార్లు గాయాల పాలయ్యాడు. అయినా సినమా కోసం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే తీసుకోడు విశాల్. లేటెస్ట్ గా లాఠీ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విశాల్. పాపను రక్షించే సీన్ లో బిల్డింగ్ మీద నుంచి కింద పడే యాక్షన్ సీన్ లో నటిస్తూ, బిల్డింగ్ మీద నుంచి కిందపడి ఇంజూరయ్యాడు.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

చేతిమనికట్టుకు, ముఖానికి గాయాలయిన విశాల్, కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తిరిగి మార్చి ఫస్ట్ వీక్ లాఠీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు ట్విట్టర్ రో పోస్ట్ షేర్ చేశాడు. ఇదే తరహాలో గతంలోనూ విశాల్ గాయాల భారిన పడ్డాడు. హైదరాబాద్ లో సామాన్యుడు సినిమా క్లయిమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లోనూ గాయపడ్డాడు విశాల్.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

అప్పుడు తలకి బలమైన గాయమే తగిలింది. సినిమా ఫైట్ సీన్స్ ల్లో నటించేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజం అని అప్పుడు చెప్పుకొచ్చారు. లేటెస్ట్ గా లాఠీ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంతో నైనా మేలుకొని డూప్ లతో, మరిన్ని జాగ్రత్తలతో యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తే మంచిదని విశాల్ అభిమానులు ఫీలవుతున్నారు.