Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

స్క్రీన్ స్పేస్ తీసుకుని సినిమాలో మేజర్ పార్ట్ అయ్యే హీరోయిన్లు కొంతమంది అయితే.. అసలు తమ ఎంట్రీతోనే సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చే హీరోయిన్లు కొంతమంది. హీరో ఎవరైనా సరే, స్క్రీన్..

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

Star Heroins (1)

Star Heroins: స్క్రీన్ స్పేస్ తీసుకుని సినిమాలో మేజర్ పార్ట్ అయ్యే హీరోయిన్లు కొంతమంది అయితే.. అసలు తమ ఎంట్రీతోనే సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చే హీరోయిన్లు కొంతమంది. హీరో ఎవరైనా సరే, స్క్రీన్ స్పేస్ ఎంత తక్కువైనా సరే.. హీరోయిన్ సాయిపల్లవి అయితే ఆ సినిమా రేంజ్ వేరేలెవల్ కి వెళ్లిపోతుంది. తన పర్ ఫామెన్స్ తో హీరోని కనపడనివ్వకుండా చేస్తుంది సాయిపల్లవి. ఫిదా అయినా, లవ్ స్టోరీ అయినా, శ్యామ్ సింగరాయ్ అయినా.. ఎలాంటి సబ్జెక్ట్ అయినా.. హీరో ఎవరైనా.. ఆడియన్స్ సాయిపల్లవి కోసమే ధియేటర్లకు వస్తారనడంలో ఏమాత్రం డౌట్ లేనంత క్రేజ్ సంపాదించుకుంది సాయిపల్లవి. రిలీజ్ కు రెడీగా ఉన్న విరాట పర్వంలో కూడా హీరో రానా అయినా.. హీరోయిన్ సాయిపల్లవి అనే సరికి సినిమా లెవల్ కి వెళ్లిపోయింది.

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

జనరల్ గా హీరోయిన్స్ కి ఓ ఇమేజ్ పడిందంటే.. ఈ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. కానీ.. కీర్తిసురేష్ మాత్రం ప్రయోగాలు చేస్తోంది. అప్పటివరకూ సో సో క్యారెక్టర్లుచేసిన కీర్తి.. మహానటితో మొత్తం గ్రాఫ్ నే ఛేంజ్ చేసేసింది. తనకోసం స్పెషల్ క్యారెక్టర్లు రాసేలా, కొన్ని సినిమాలకు తను తప్పవేరే ఆప్షన్ లేదనేలా చేస్తోంది కీర్తిసురేష్. అలనాటి సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాని సింగిల్ గా హిట్ చేసిందనడంతో ఏమత్రం డౌట్ లేదు. సోలో పర్ ఫామెన్స్ తో తన అమేజింగ్ టాలెంట్ తో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్. రీసెంట్ గా వచ్చిన గుడ్ లక్ సఖిలో కూడా సోలోగా సినిమాని లీడ్ చేసింది. ఇంత క్యాపబుల్ కాబట్టే.. హీరోయిన్స్ కి స్పేస్ ఇచ్చే పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబుతో హీరోయిన్ గా సర్కారు వారి పాట సినిమా చేస్తూ సినిమా మీద హైప్ పెంచేసింది.

Vishal: మరోసారి విశాల్‌కు గాయాలు.. యాక్షన్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

ట్రిపుల్ఆర్ లో హీరోయిన్ గా చేస్తున్న ఆలియా స్క్రీన్ స్పేస్ తక్కువే. కానీ సినిమా ఆలియా ఎంట్రీతో వేరే లెవల్ కి వెళ్లిపోయింది. అంతేకాదు.. రాబోతున్న కొరటాల.. ఎన్టీఆర్ సినిమాలో కూడా హీరోయిన్ నేనే అని అనౌన్స్ చేసి సినిమాకు ఇప్పటినుంచే క్రేజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ లో హీరోలని మించిపోయిన దీపికా పదుకోన్… సోలోగా సినిమాలు చేస్తూ తనే హీరోగా ఆడియన్స్ ని పుల్ చేస్తోంది. ఇంత సత్తా ఉన్న హీరోయిన్ తెలుగులో ప్రభాస్ తో ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్స్ ని హైలెట్ చేసే నాగాశ్విన్ డైరెక్షన్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ.. సినిమాకి మెయిన్ హైలెట్ అవుతోంది దీపికా పదుకోన్. ఇలా సినిమా ఏదైనా సరే.. తమఅప్పియరెన్స్ తో పాటుస్క్రీన్ స్పేస్ ని పెంచుకుంటూ సినిమా మార్కెట్ ని వేరే లెవల్ కి తీసుకెళుతున్నారు హీరోయిన్లు.