Ap Rain Alart: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
ఒకవైపు రుతుపవనాల(Ap Rain Alart) పలకరింపు, మరోవైపు వడగాల్పుల వాతావరణం, ఏపీలో భిన్నమైన పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన.
Disaster Management Authority ap rain alert that Monsoon reached Andhra Pradesh.
- ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.
- కొన్ని జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక.
- పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తం.
Ap Rain Alart: ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను తాకిన ఈ మాన్సూన్, రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే, ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం వర్షపాతం సాధారణం కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందని, వాతావరణంలో తరచూ విరామాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Pawan Kalyan: NTTPS బూడిద కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
రాష్ట్రంలో జిల్లాల వారీగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. గోదావరి జిల్లాలు, రాయలసీమ, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా.. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు(Ap Rain Alart) కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంటూ, రైతులు దీనికి అనుగుణంగా పంట ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో వర్షాలతో పాటు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దాదాపు 162 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతున్న తరుణంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని, నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది.
