Shrasti Verma : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ..
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీ కండువా కప్పుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.(Shrasti Verma)
Shrasti Verma
Shrasti Verma : ఇటీవల ఓ కేసు విషయంలో వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ నేడు బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొంతమంది కూడా బీజేపీలో చేరారు.
ఓ పక్క డ్యాన్స్ లతో, సినిమాలతో బిజీగా ఉంటూ, కేసు విషయంలో వైరల్ అయిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఇలా సడెన్ గా బీజేపీలో చేరడంతో చర్చగా మారింది. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీ కండువా కప్పుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి.
Also Read : Trivikram – Bandla Ganesh : వివాదం ముగిసినట్టేనా? ఆ ఇద్దరి కలయిక.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..
శ్రష్టి వర్మ ఉత్తర్‌ప్రదేశ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. స్కూల్లో ప్రోగ్రామ్స్ తో పాటు బయట కూడా పలు స్టేజీలపై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చింది. ఢీ షోలో కో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చి ఢీ జోడీ తో డ్యాన్సర్ గా మారి అనంతరం పలు సినిమాలకు జానీ మాస్టర్, పలువురు మాస్టర్స్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. పుష్ప2 సినిమాలో ‘సూసేకి..’ సాంగ్ తో కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ అక్కడ్నుంచి వరుసగా సినిమాలు చేస్తుంది. బిగ్ బాస్ సీజన్9లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. నటిగా కూడా మారి సినిమాల్లో నటిస్తుంది.

