Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

మోస్ట్ హ్యాపెనింగ్ బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు మూడు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నఈ జంట త్వరలో ఒక్కటి కాబోతున్నారు. అసలు పెళ్లి వరకూ వచ్చిన..

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

Bollywood Couples

Bollywood Couples: మోస్ట్ హ్యాపెనింగ్ బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు మూడు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నఈ జంట త్వరలో ఒక్కటి కాబోతున్నారు. అసలు పెళ్లి వరకూ వచ్చిన ఈ రిలేషన షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది..? ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు..? ఎలా ప్రపోజ్ చేశారు..? అసలు ఈ రిలేషన్ పెళ్లి వరకూ ఎలా దారితీసింది..? ఇలా రణబీర్-ఆలియాతో పాటు బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏంటో లవ్లీగా తెలుసుకుందాం.

Bollywood Heroins: బ్యూటీ విత్ బ్రెయిన్.. స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న హీరోయిన్లు!

పెళ్లంటే అంత ఈజీ కాదు. ఇద్దరు మనుషులకంటే ముందు ఇద్దరు మనసులు కలవాలి. అప్పుడు మాత్రమే ఆ పెళ్లి ప్రేమతో సరదాగా, సంతోషంగా కంటిన్యూ అవుతుంది. జనరల్ గానే సినిమా ఇండస్ట్రీలో రిలేషన్ షిప్స్ ఎక్కువ. ఒకరితో ఒకరు ఎక్కువ టైమ్ స్పెడ్ చేస్తారు కాబట్టి.. ఈజీగా కనెక్ట్ అయిపోయి ప్రేమలో పడిపోతారు. అయితే ఆ ప్రేమలు పెళ్లి వరకూ వచ్చేవి చాలా తక్కువే. లేటెస్ట్ గా అలా పెళ్లి పీటలెక్కుతున్న ప్రేమ రణబీర్ -ఆలియాది. ఎన్నో బ్రేకప్స్ తో బాలీవుడ్ లో ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ లో ఆలియాకి ఏం నచ్చింది..? ఆలియాని రణబీర్ ఎలా ఇంప్రెస్ చేశాడు అన్నది మాత్ర చాలా ఇంట్రస్టింగ్ టాపిక్.

Bollywood Stars: ప్రొడక్షన్ దగ్గర నుంచి ఐపీఎల్ వరకు.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

ప్రేమ ఉండడం వేరు.. దాన్ని ఎక్స్ ప్రెస్ చెయ్యడం వేరు. ఆ ప్రపోజ్ చెయ్యడంలోనే పడిపోతారు అటు అమ్మాయైనా.. అబ్బాయైనా. ఆలియా-రణబీర్ విషయంలో కూడా ఈ ప్రపోజల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆలియాతో పరిచయం అయ్యే నాటికే రణబీర్ కి ఆల్రెడీ దీపికా పదుకోన్, కత్రినా లాంటి స్టార్ హీరోయిన్స్ తో బ్రేకప్స్ అయిపోయాయి. కానీ ఆలియాతో పరిచయం రణబీర్ ని మార్చేసింది. మెచ్యూర్డ్ పర్సన్ ని చేసింది. సెటిల్డ్ గా ఆలోచించడం నేర్పింది. ఈ మార్పే.. ఈ నిజాయితీయే ఆలియాకి రణబీర్ ని పెళ్లి చేసుకునే వరకూ తీసుకొచ్చింది. అంతేకాదు.. లేటెస్ట్ గా ఆలియా.. రణబీర్ తో ప్రేమ అనే ఫీల్ పుట్టినప్పుడే మా ఇద్దరికీ పెళ్లైపోయింది అంటూ ఓపెన్ గానే తమ లవ్ ఇంటెన్సిటీని షేర్ చేసుకుంది. అందుకే ఈ ప్రేమ పెళ్లి వరకూ వచ్చింది.

Bollywood Heroins: సౌత్ బాటలో బీటౌన్ హీరోయిన్స్.. కేరాఫ్ టాలీవుడ్!

ఆలియా-రణబీర్ అనే కాదు.. బాలీవుడ్ లో ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటలు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ లవ్ మ్యారేజ్ చేసుకుని సర్ ప్రైజ్ చేసిన జంట కత్రినా-విక్కీ. ఆల్రెడీ సల్మాన్, రణబీర్ లాంటి హీరోలతో రిలేషన్ లో ఉన్న కత్రినా.. తనకంటేచిన్న వాడైన విక్కీకి కనెక్ట్ అయ్యింది. తన మీద విక్కీకి ఉన్న కేరింగ్ కి బాగా ఇంప్రెస్ అయ్యింది కత్రినా. అంతే.. పబ్లిక్ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా రాజస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చాలా కాలం నుంచి వీళ్ల ప్రేమ, పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నా.. ఏమాత్రం రెస్పాండ్ అవ్వని ఈ జంట సడెన్ గా పెళ్లి పీటలెక్కి ఫాన్స్ కి షాకిచ్చారు. పెళ్లికి ముందు వరకూ ఎలాంటి హింట్ ఇవ్వని ఈ ప్రేమ జంట పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటయ్యామని పోస్ట్ పెట్టారు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

తెర మీద అతడు రామ్‌… ఆమె లీలా. అతడు బాజీరావ్‌.. ఆమె మస్తానీ. అతడు ఖిల్జీ.. ఆమె పద్మావత్‌. ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. మూడు సినిమాలు.. ఆరేళ్ల ప్రేమాయణం.. అన్నీ కలిసి వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఆల్ మోస్ట్ ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ప్రేమ, పెళ్లి అన్నీ ఇంట్రస్టింగ్ గానే జరిగాయి. ఫస్ట్ టైమ్ చూసినప్పుడే దీపికతో ప్రేమలో పడిపోయాడు రణవీర్. అప్పటికే బ్రేకప్స్ తో డిప్రెషన్ లో ఉన్న దీపికా కోలుకోవడానికి రణవీర్ ప్రేమ చాలా హెల్ప్ అయ్యింది. రామ్ లీలా టైమ్ లో పరిచయం వీళ్ల మధ్య ప్రేమ వరకూ ఆ తర్వాత పెళ్లి వరకూ వచ్చింది. పెళ్లికి 4 ఏళ్ల ముందే ఎంగేజ్ మెంట్ చేసుకుని సీక్రెసీ మెయింటెన్ చేశారు దీపికా, రణవీర్ సింగ్. ఆ నమ్మకం, ప్రేమతోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి తర్వాత కూడా అంతే ప్రేమగా తమ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు దీపికా, రణవీర్ సింగ్.

Bollywood Directors: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. యంగ్ డైరెక్టర్ల మిస్ ఫైర్!

నిజానికి ప్రేమించుకున్నా.. మీడియా ముందు సీక్రెసీ మెయింటెన్ చేస్తారు స్టార్లు. బట్.. రణ్ వీర్ మాత్రం.. తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా.. దీపికకు తన ప్రేమను పబ్లిక్ గానే ఎక్స్ ప్రెస్ చేశాడు. నిజానికి 6 ఏళ్లు.. అంత ఈజీగా ఏం అవ్వలేదు. దీపికా కనిపించిన ప్రతిసారీ.. రణ్ వీర్ తన ప్రేమను చెప్తూనే ఉన్నాడు. అమ్మాయిలకు జనరల్ గా ఇష్టమైన రోజ్ ఫ్లవర్ తో దీపికకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. ఇద్దరూ ఎప్పుడు కలిసినా.. తనఫీలింగ్స్ ని షేర్ చేశాడు. రణవీర్.. లిటరల్ గా వెంటపడి.. ఇష్టపడి.. ప్రేమించి.. మెప్పించి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నాడనే చెప్పాలి.

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

లవ్ మ్యారేజ్ చేసుకున్నామన్నది కాదు.. ఎలా ప్రపోజ్ చేశామన్నదే ఇక్కడ హాట్ టాపిక్. ఇప్పటికే సినిమాల్లో చాలా సార్లు లవ్ సీన్లు చేసి ఎక్స్ పీరియన్స్ వచ్చిన ఈ బాలీవుడ్ లవర్స్.. తమ లవర్ ని ఒప్పించడానికి, ఇంప్రెస్ చెయ్యడానికి ఎలా ప్రపోజ్ చేసి ఉంటారు..? తన కంటే దాదాపు 10 ఏళ్లు చిన్న వాడైన నిక్.. ప్రియాంకా చోప్రాకి తన లవ్ ని ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా..?

Bollywood Remakes: 25 తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్. అసలు ఈ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు..? అది పెళ్లి వరకూ ఎలా వచ్చిందన్నది చాలా ఇంట్రస్టింగ్. ప్రేమలో పడితే పడ్డారు.. తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్లు పెద్దదైన ప్రియంకాని నిక్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది అంతకంటే ఎక్కువ ఇంట్రస్టింగ్. లవ్ ఎట్ పస్ట్ సైట్ అన్నట్టు.. ప్రియాంకాని చూసినప్పుడే మోకాళ్ల మీద నుంచి ప్రపోజ్ చేసేశాడు నిక్. ఆ తర్వాత కొన్ని నెలలకే నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేసేశాడు నిక్.

Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

నిక్, ప్రియాంకా మీద తన ప్రేమను చూపించడానికి.. ప్రియాంకా బర్త్ డే వరకూ వెయిట్ చేశాడు. ప్రియాంకా బర్త్ డే రోజు అర్దరాత్రి మోకాళ్ల మీద కూర్చుని.. నిన్ను పెళ్లిచేసుకని ఈ ప్రపంచంలో హ్యపీ యస్ట్ పర్సన్ గా ఉండాలనుకుంటున్నాను.. విల్ యూ మ్యారీ మీ అంటూప్రపోజ్ చేశాడు. అయితే నిక్ ప్రపోజ్ చేసిన తర్వాత నిమిషం పాటు ఏం మాట్లాడని ప్రియంకా ఆ తర్వాత నిక్ కి ఓకే చెప్పింది. ఇలా నిక్ ప్రపోజల్ తో ఇంప్రెస్ అయిపోయిన ప్రియాంకా కొన్నాళ్ళు డేటింగ్ చేసి పెళ్లి పీటలెక్కేశారు.

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

బాలీవుడ్ హాట్ కపుల్ కరీనా, సైఫ్ అలీఖాన్ కూడా అప్పట్లో తమ పెళ్లిని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు. వయసులో దాదాపు 15 ఏళ్లకు పైగా తేడా ఉన్నా కూడా వీళ్లిద్దరి మధ్య అన్ కండిషనల్ లవ్ పెళ్లి వరకూ వచ్చింది. తషన్ సినిమా అప్పుడు కనెక్ట్ అయిన ఈ ఇద్దరూ తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకొచ్చారు. అయితే అప్పటికే డివోర్స్ తీసుకున్న సైఫ్ అలీఖాన్.. కరీనాతో ప్రేమలో పడ్డాడు. సైఫ్ తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చెయ్యడానికి కరీనాని ఇంప్రెస్ చెయ్యడానికి పారిస్ ని సెలక్ట్ చేసుకున్నాడు. లవర్స్ డెస్టినేషన్ అయిన పారిస్ లో కరీనాకి ప్రపోజ్ చేసి తన ప్రేమను ఓకే చేయించుకుని.. అంతే స్పీడ్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు సైఫ్ అలీఖాన్.

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

బాలీవుడ్స్ మోస్ట్ ఇంట్రస్టింగ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్. అభిషేక్ కూడా ఐశ్వర్యా రాయ్ కి అంతే సినిమాటిక్ గా ప్రపోజ్ చేశారు. ఫస్ట్ చూసినప్పటి నుంచి ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకున్న ఈ జంట.. న్యూయర్క్ లో హోటల్ రూమ్ బాల్కనీ నుంచి ఐశ్వర్యాని చూసే సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఐశ్వర్యాని పెళ్లి చేసుకుంటే బావుండని ఫీల్ అయ్యడట అభిషేక్ బచ్చన్. అయితే సంవత్సరం తర్వాత గురు ప్రీమియర్ కి వెళ్లినప్పుడు న్యూయర్క్ లోని అదే హోటల్ బాల్కనీలో ఐశ్వర్యా రాయ్ కి ప్రపోజ్ చేశారు అభిషేక్ బచ్చన్. ఇక ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అభిషేక్, ఐశ్వర్య.

Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

బాలీవుడ్ బాద్ షా.. రొమాంటిక్ హీరో.. షారూఖ్ ఖాన్ కూడా గౌరీ ఖాన్ ని లవ్లీ గా ప్రపోజ్ చేశారు. ఎప్పటినుంచో ఒకరంటే ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంది. చల్లని శీతాకాలంలో.. ఓ హాట్ చాక్లెట్ కప్ తో గౌరీ ఖాన్ కి ప్రపోజ్ చేసిన షారూఖ్.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఆతర్వాత తన కార్ లో గౌరిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. అయితే కార్ లో గౌరి ఏం సమాధానం చెప్పిందో కూడా విననంత టెన్షన్ లో కార్ డ్రైవ్ చేశారు షారూఖ్. అయితే తర్వాత షారూఖ్ కి ఓకే చెప్పిన గౌరీ.. అంతే ప్రేమగా షారూఖ్ తో ఏడడుగులు వేసింది.

Bollywood : ఒకే సినిమాలో సల్మాన్, షారుఖ్, హృతిక్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ రాబోతోంది!

మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్.. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్ల పెళ్లి కూడా ఇండియాలో కాకుండా టస్కనీలో జరిగింది. సో కాల్డ్ ప్రపోజల్ ఏం చెయ్యకపోయినా.. ఇద్దరి మధ్యా ప్రేమ పెళ్లి వరకూ తీసుకొచ్చింది. కోహ్లికి కామన్ ఫ్రెండ్ ద్వారా అనుష్కతో పరిచయం పెళ్లి వరకూ దారితీసింది. అంతేకాదు ఇద్దరి మధ్య ఆ ప్రేమ ఉన్నప్పుడు దాన్ని చూపించడానికి స్పెషల్ గా ప్రపోజ్ చెయ్యాల్సిన అవసరం లేదంటారు అనుష్క, విరాట్.

Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

మరో బాలీవుడ్ లవ్ మ్యారేజెస్ లో ఒకటి సోనమ్ కపూర్ పెళ్లి. స్టార్ వారసురాలిగా ఇండస్ట్రీలో సోనమ్ కు క్రేజ్ ఉంది. బిజినెస్ మ్యాన్ ఆనంద్ ఆహుజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చైల్డ్ హుడ్ ఫ్రెండ్ గా ఎప్పటి నంచో సోనమ్, ఆనంద్ మధ్య ఆ ప్రేమ ఎప్పుటి నుంచో ఉంది. ఆనంద్ వాళ్ల ఎంగేజ్ మెంట్ కు 90 లక్షలతో వెడ్డింగ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

Bollywood Sequels: పార్టుల మీద పార్టులు.. బాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా!

తెలుగు తెరపై హ హ హసినిగా అలరించిన ముద్దుగుమ్మ జెనిలియా కూడా తన సహనటున్నే పెళ్లాడింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ ముఖ్ తో చాలా కాలం లవ్ ట్రాక్ నడిపిన ఈ భామ తరువాత అతన్నే వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయిన ఈ జంట బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనిపించుకుంటున్నారు.