Bollywood Heroins: బ్యూటీ విత్ బ్రెయిన్.. స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న హీరోయిన్లు!

బాలీవుడ్ హీరోల కన్నా హీరోయిన్లు చాలా స్మార్ట్. సంపాదించిన కోట్ల కూపాయల డబ్బుని అదీ ఇదీ అని కాకుండా ఫాస్ట్ రిటర్న్ వచ్చే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు..

Bollywood Heroins: బ్యూటీ విత్ బ్రెయిన్.. స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్న హీరోయిన్లు!

Bollywood Heroins (1)

Bollywood Heroins: బాలీవుడ్ హీరోల కన్నా హీరోయిన్లు చాలా స్మార్ట్. సంపాదించిన కోట్ల కూపాయల డబ్బుని అదీ ఇదీ అని కాకుండా ఫాస్ట్ రిటర్న్ వచ్చే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ఎందుకని.. సొంతగా స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ విత్ బ్రెయిన్ భామలు.

Bollywood Heroins: సౌత్ బాటలో బీటౌన్ హీరోయిన్స్.. కేరాఫ్ టాలీవుడ్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. సినిమాకి మినిమం 15 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే కా ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దీపికా.. డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్, ఎపిగామియా, బెంగుళూరు బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ బెల్లాట్రిక్స్, డిజిటల్ పెట్ కేర్ ఫౌండేషన్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ కంపెనీ బ్లూ స్మార్ట్ అనే చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. దీపికాతో పాటు సినిమాలు, యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న భర్త రణ్‌వీర్ సింగ్ కూడా ఎడ్‌టెక్ రంగంలో ఇన్వెస్ట్ చేశారు.

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

మరో స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరు. 2018లోనే బంబుల్ అనే అమెరికా బేస్డ్ డేటింగ్ యాప్ లో పార్టనర్ తో పాటు ఎడ్వైజర్ గా కొనసాగుతోంది. అంతేకాదు దాదాపు 60 కోట్ల వరకూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకునే హోబర్ట్ స్కూల్ లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. దీందో పాటు అమెరికా టెక్నాలజీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా భారీగానే పెట్టుబడులుపెట్టింది ప్రియాంకా.

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

ఈమధ్య పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ తోపాటు అంతే తెలివిగా ఇన్వెస్ట్ చేసే హీరోయిన్స్ లో ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ తన ఓన్ బ్యూటీ బ్రాండ్..కే..లో ఇన్వెస్ట్ చెయ్యడమే కాకుండా మరికొన్ని బ్యూటీ బ్రాండ్స్ ఎంబాసిడర్ గా పనిచేస్తోంది.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

100 కోట్ల కలెక్షన్ల క్వీన్ ఆలియా భట్ కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాగా సంపాదిస్తోంది. సినిమాలు చేస్తూ.. డబ్బులు సంపాదించడమే కాకుండా తెలివిగా వాటిని ఇన్వెస్ట్ చేస్తోంది. ఫ్యాషన్ స్టార్టప్ స్టైల్ క్రాకర్ అనే ఫ్యాషన్ కంపెనీలో స్టేక్ హోల్డర్ అయ్యింది. అంతేకాదు.. మరో బ్యూటీ బ్రాండ్ నైకాలో కూడా షేర్ తీసుకుంది ఆలియా భట్. భారత్‌లో తొలి ఆన్‌లైన్ స్టయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ లో ఆలియా భట్ 2017 నుంచి పెట్టుబడులు పెడుతోంది. కొంతకాలం క్రితం ఐఐటీ కాన్పూర్‌కు అనుబంధంగా ఉన్న ఒక స్టార్టప్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తోంది.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

బాలీవుడ్ దీవా ఐశ్వర్యారాయ్ చాలా కంపెనీల్లో వాటాలు కొనేసింది. న్యూట్రిషన్ బేస్డ్ కంపెనీతో పాటు బెంగుళూరుబేస్డ్ ఎన్విరాన్ మెంటల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అంబీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ఈ స్టార్టప్ హెల్త్ రీసెర్చెస్, మీడియా కంపెనీస్, డేటా డెవలపర్స్ కి బెటర్ డెసిషన్ మేకింగ్ కి హెల్ప్ చేస్తోంది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సినిమాకు మినిమం 12 కోట్లు తీసుకనే కరీనా కపూర్ కూడా గట్టిగానే ఇన్వెస్ట్ చేస్తోంది. సొంతంగా మేకప్ బ్రాండ్‌ను రూపొందించిన కరీన కపూర్ ఖాన్, ఈ మద్యే ఐపీఓకి వచ్చిన ఒక ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు అక్క కరిష్మా కపూర్ ఆన్‌లైన్ బేబీ ప్రోడక్ట్స్ కంపెనీతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ మలైకా అరోరాకు సంబంధించిన స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేశారు.

Bollywood Heroins: టాలీవుడ్‌కి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్స్.. ఇదీ క్రేజ్ అంటే!

మరో యంగ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసింది. డి2సి అనే బ్యూటీ బ్రాండ్ కి పెట్టుబడి పెడుతోంది శ్రద్దా. బ్రాండ్ ప్రొడక్ట్స్ ని ఎండార్స్ చెయ్యడమే కాకుండా తన ఓన్ వెబ్ సైట్ ద్వారానే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అయ్యే వెబ్ సైట్, యాప్ లను కూడా ప్రమోట్ చేస్తోంది శ్రద్దా.

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

ఫిట్ నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి కూడా దాదాపు కోటిన్నర వరకూ బేబీ ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీ మమా ఎర్త్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ బ్రాండ్ ఆసియాలోనే సేఫ్ మేడ్ అనే సర్టిఫికెట్ సంపాదించిన ఫస్ట్ బ్రాండ్. ఈ బిజినెస్ లోనే కాకుండా.. సింపుల్ సోలో ఫుల్ అనే హోలిస్టిక్ వెల్ నెస్ హెల్త్ యాప్ స్టరా్ట్ చేసిన ఎక్స్ పర్ట్స్ చేత యోగా, ఎక్సర్ సైజెస్ తో పాటు ఇమ్యూనిటీ, డైట్ ప్రోగ్రామ్స్ కూడా చేయిస్తోంది శిల్పాశెట్టి.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

ఇలా ఒక్కటేమిటి.. కోట్లలో సంపాదించిన డబ్బంతా పిల్లలకు సంబంధించిన అమ్యూజ్‌మెంట్ పార్కుల దగ్గరనుంచి ప్రీమియర్ లీగ్‌ల వరకూ రిటైల్ బిజినెస్ నుంచి రెస్టారెంట్ల వరకు ఇలా అన్ని రకాలుగా స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు మన స్టార్లు.