South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

నార్త్ హీరోయిన్లు టైమ్ వేస్ట్ చెయ్యకుండా పెళ్లి, కెరీర్ ని కరెక్ట్ టైమ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం.. పెళ్లికి టైమ్ తో పనేంటి..? ఎప్పుడు కావాలంటే అప్పుడు..

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

South Heroins

South Heroins: నార్త్ హీరోయిన్లు టైమ్ వేస్ట్ చెయ్యకుండా పెళ్లి, కెరీర్ ని కరెక్ట్ టైమ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం.. పెళ్లికి టైమ్ తో పనేంటి..? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్కోవచ్చు.. అయినా ఇప్పుడు పెళ్లికి తొందరేంటి..? అసలు మాకు పెళ్లి, పిల్లల గురించి ఆలోచించే టైమ్ లేదంటున్నారు.

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

అసలు పెళ్లి ఊసేఎత్తని 40 ఏళ్ల స్టార్ హీరోయిన్ అనుష్క. సౌత్ లో అనుష్క అన్ డౌటెడ్ లీస్టార్ హీరోయిన్. అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్, ఇమేజ్ సంపాదించుకుంది స్వీటీ. కెరీర్ కిమధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలు మొదలుపెట్టిన అనుష్క.. పెళ్లి అంటే మాత్రం మాటదాటేస్తోంది. ఎప్పుడు రాసి పెట్టిఉంటే అప్పుడే జరుగుతుంది.. వాటి గురించి ఆలోచించడం ఎందుకంటోంది.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

సౌత్ మొత్తం చుట్టేస్తున్న త్రిష కూడా అంతే. ఈ సంవత్సరం.. నెక్ట్స్ ఇయర్ పెళ్లి చేసుకుంటానని చెబుతూనే వస్తోంది. ఇక ఎన్నాళ్లని ఈ సోలో లైఫ్.. నేను కూడా మ్యారీడ్ లైఫ్ టేస్ట్ చూస్తానని చాలా కాలం నుంచి చెబుతోంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్న త్రిష.. ఈ సారి ఆ తప్పు చెయ్యనంటోంది. నన్ను నన్ను ఇష్టపడే వాడు దొరకినప్పుడు అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా చేసేసుకుంటానన్న38 ఏళ్ల త్రిష ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు .

South Heroins: గ్లామర్ డాల్స్ కాదు.. హీరోలతో సమానంగా హీరోయిన్ల మార్కెట్!

32 ఏళ్ల మిల్కీ బ్యూటీ తమన్నా… కూడా సారీ బాస్ ఇప్పుడు నేను పెళ్లిచేస్కునే మూడ్ లో లేను. వరసగా సినిమాలు, సిరీస్ లు, షోలు.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ వర్క్ తో బిజీగా ఉన్నప్పుడు పెళ్ళి గురించి ఎలా ఆలోచిస్తానంటోంది. ప్రజెంట్ ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, చిరంజీవి, నాగార్జున ఇలా చాలా సినిమాలు చేస్తోంది తమన్నా.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

30 ఏళ్లు దాటినా.. మాకప్పుడే పెళ్లేంటంటున్నారు కొంతమంది హీరోయిన్లు. 10ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన రాశీ ఖన్నా.. సౌత్ టూనార్త్.. సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఇక సినిమాలేనా.. పెళ్లెప్పుడు అంటే.. పెళ్లా.. దానికేం తొందర అంటోంది. పనితో ఫుల్ బిజీగా ఉన్నాను.. పెళ్లి చేస్కునేంత ఖాళీగా లేనంటోంది ఈ క్యూట్ పాప. ప్రజెంట్ థాంక్యూ, రుద్ర లాంటి ప్రాజెక్ట్స్ రాశి చేతిలోఉన్నాయి.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ.. నార్త్ లో కూడా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్న పూజాహెగ్డే అయితే.. నాకా.. పెళ్లా.. అసలు దాని గురించి ఆలోచనే లేదంటోంది. చేతిలో 4,5 ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న పూజా.. ప్రజెంట్ చేస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే. అందుకు అసలు పెళ్లి ఊసే నా దగ్గర తీస్కురావద్దంటోంది. పెళ్లికి ఇంకా చాలా టైముంది.. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు కదా..ఆలోచేం టైమ్ కూడా లేదంటోంది ఈ 31 ఏళ్ల ముద్దుగుమ్మ.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ కి మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ గా మారిపోయింది మళయాళ భామ సాయిపల్లవి. కెరీర్ బానే ఉంది.. మరి పెళ్లి సంగతేంటి..? ప్రేమ పెళ్లా..? పెద్దలు కుదిర్చిన పెళ్లా అని అభిమానులు అడిగితే.. అబ్బే .. అసలు ఆ ఉద్దేశ్యమే లేదంటోంది. ఫిదా సినిమాలో తన తండ్రిని వదిలి వెళ్లను.. అసలు పెళ్లి చేసుకోను అన్న సాయిపల్లవి రియల్ లైఫ్ లో కూడా ఇలానే అంటోంది ఈ యాక్టర్ కమ్ డాక్టరమ్మ.

Senior Actress: సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన సీనియర్లు.. మళ్ళీ రీఎంట్రీ!

నేషనల్ క్రష్ రష్మిక అయితే.. నేనింకా చిన్నపిల్లని.. నాతో పెళ్లి లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదంటోంది. పాతికేళ్ల ఈముద్దుగుమ్మ.. ఇప్పుడు సౌత్ లోనే బిజీ యెస్ట్ హీరోయిన్. సౌత్ స్టార్ హీరోలతో పాటు.. బాలీవుడ్ హీరోల్ని కూడా లైన్లో పెట్టేసిన రష్మిక మందాన.. పెళ్లి అనే మాట అనడానికి కూడా టైమ్ లేదంటోంది. పుష్ప హిట్ తో మరిన్ని సినిమా ఛాన్సులతో బిజీ అయిన రష్మక పెళ్లికేం తొందరంటోంది. ఒక వైపు నార్త్ హీరోయిన్లు కెరీర్ పీక్స్ లోనే వాళ్లు పెళ్లి చేసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం.. పెళ్లి మాట ఎత్తితే తప్పించుకు తిరుగుతున్నారు.