Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

పూజాహెగ్డే సౌత్ ని బ్యాక్ సక్సెస్ లతో ఏలుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే .. తనసినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదంటోంది. సినిమా ఓకే చేసేటప్పుడు కథలో తన పాత్ర..

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

Star Heroins

Star Heroins: పూజాహెగ్డే సౌత్ ని బ్యాక్ సక్సెస్ లతో ఏలుతుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే .. తనసినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదంటోంది. సినిమా ఓకే చేసేటప్పుడు కథలో తన పాత్ర ఇంపార్టెన్స్ మాత్రమే చూసుకుంటుందట కానీ.. స్టార్ కాస్ట్ ఉందా లేదా అన్నది అంతగా పట్టించుకోదట పూజా. అందుకే అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో హీరో కంటే హీరోయిన్ పూజాకే ఎక్కువ పేరొచ్చింది. ఆ తర్వాత వరస పెట్టిసినిమాలు చేస్తూ.. పూజా ఉంటే చాలు.. ధియేటర్లకు జనాలు వస్తారనే క్రేజ్ సంపాదించుకుంది. వరసగా చరణ్, మహేష్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న పూజా.. సడెన్ గా సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యే రేంజ్ కి వెళ్లిపోయింది. అందుకే స్టార్ హరోలందరూ లక్కీ చామ్ అంటూ.. వరసగా తమ సనిమాలో ఆఫర్లిస్తున్నారు.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

హీరో ఎవరైనా సరే, స్క్రీన్ స్పేస్ ఎంత తక్కువైనా సరే.. హీరోయిన్ సాయిపల్లవి అయితే ఆ సినిమా రేంజ్ వేరేలెవల్ కి వెళ్లిపోతుంది. తన పర్ ఫామెన్స్ తో హీరోని కనపడనివ్వకుండా చేస్తుంది సాయిపల్లవి. రిలీజ్ కు రెడీగా ఉన్న విరాట పర్వంలో కూడా హీరో రానా అయినా.. హీరోయిన్ సాయిపల్లవి అనే సరికి సినిమా రేంజ్ మారిపోయింది. ఇక ఫిదా అయినా, లవ్ స్టోరీ అయినా, శ్యామ్ సింగరాయ్ అయినా.. ఎలాంటి సబ్జెక్ట్ అయినా.. హీరో ఎవరైనా.. ఆడియన్స్ సాయిపల్లవి కోసమే ధియేటర్లకు వస్తారనడంలో ఏమాత్రం డౌట్ లేనంత క్రేజ్ సంపాదించుకుని హీరోలకు సవాల్ విసురుతోంది.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

సౌత్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సోలో గా ప్రూవ్ చేసుకుంటోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా పర్ ఫామెన్స్ ఓరియంటెడ్, విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకునే నయన్ స్టార్ హీరోలతో పోటీపడుతూ.. తన సోలో మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

ఒకప్పుడు గ్లామర్ రోల్స్ తో సరిపెట్టుకున్న హీరోయిన్లు ఇప్పుడు.. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ విషయంలో కూడా పోటీపడుతున్నారు. ఆడియన్స్ ని ధియేటర్లకు రప్పింగల సత్తా తమకు కూడా ఉందంటూ..అదే రేంజ్ లో సినిమాలు కూడా చేస్తూ.. ప్రూవ్ చేసుకుంటున్నారు. జనరల్ గా హీరోయిన్స్ కి ఓ ఇమేజ్ పడిందంటే.. ఈ ఇమేజ్ నుంచి బయటికి రావడం కష్టం. కానీ.. అప్పటివరకూ సో సో క్యారెక్టర్లు చేసిన కీర్తి.. మహానటితో మొత్తం గ్రాఫ్ నే ఛేంజ్ చేసేసింది. తనకోసం స్పెషల్ క్యారెక్టర్లు రాసేలా, కొన్ని సినిమాలకు తను తప్పవేరే ఆప్షన్ లేదనేలా చేస్తోంది కీర్తిసురేష్. రీసెంట్ గా వచ్చిన గుడ్ లక్ సఖిలో కూడా సోలోగా సినిమాని లీడ్ చేసింది. ఇంత క్యాపబుల్ కాబట్టే.. హీరోయిన్స్ కి స్పేస్ ఇచ్చే పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబుతో హీరోయిన్ గా సర్కారు వారి పాట సినిమా చేస్తూ సినిమా మీద హైప్ పెంచేసింది. వీటితో పాటు స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది మహానటి.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

కెరీర్ స్టార్టింగ్ నుంచి నా రూట్ సెపరేట్ అని చెబుతున్న శృతి హాసన్.. నేమ్ ఫేమ్ ని పట్టించుకోకుండా తన దారిలో తను సినిమాలు చేస్తోంది. జస్ట్ సినిమాలే కాదు.. తన నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చే ఏ ఫ్లాట్ ఫామ్ అయినా ఓకే చెబుతోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూనే.. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయినబెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్ లో సెంటర్ ఫఆప్ ధ ఎట్రాక్షన్ అయ్యి మంచి మైలేజ్ ఇచ్చింది శృతి హాసన్.

Heroins Swim Shoot: అసలే హాట్ లేడీస్.. ఆపై స్విమ్ సూట్స్.. కుర్రాళ్లలో అలజడి!

అసలు హీరోయిన్స్ కి ఈ జనరేషన్ లో సెపరేట్ మార్కెట్ ఉంటుందని ప్రూవ్ చేసిన హీరోయిన్ అనుష్క. అరుంధతి నుంచి బాహుబలి, భాగమతి లాంటి సినిమాలతో హీరోలు అవసరం లేకుండానే మంచి మార్కెట్ సాదించింది స్వీటీ. రికార్డ్ కలెక్షన్లతో అమేజింగ్ పర్ ఫామెన్స్ తో ఇండస్ట్రీనే సర్ ప్రైజ్ చేసింది జేజమ్మ. కాస్త గ్యాప్ తర్వాత మరో ఇంట్రస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తోంది అనుష్క. ఇలా హీరోయిన్లు మాత్రం హీరోలతో పోటీపడుతూ.. క్రేజ్ వైజ్, కలెక్షన్ల వైజ్, ఇమేజ్ వైజ్ తమకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు.