South Heroins: గ్లామర్ డాల్స్ కాదు.. హీరోలతో సమానంగా హీరోయిన్ల మార్కెట్!

సినిమాలో స్క్రీన్ స్పేస్ దగ్గరనుంచి రెమ్యూనరేషన్స్ వరకూ ప్రతి విషయంలో పోటీ పడడమే కాకుండా తమకు హీరోయిజం చూపించేంత సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. అందుకే హీరోలతో..

South Heroins: గ్లామర్ డాల్స్ కాదు.. హీరోలతో సమానంగా హీరోయిన్ల మార్కెట్!

South Heroins

South Heroins: సినిమాలో స్క్రీన్ స్పేస్ దగ్గరనుంచి రెమ్యూనరేషన్స్ వరకూ ప్రతి విషయంలో పోటీ పడడమే కాకుండా తమకు హీరోయిజం చూపించేంత సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్లు. అందుకే హీరోలతో పాటు సౌత్ హీరోయిన్లు కూడా ప్యార్లల్ మార్కెట్ తో తగ్గేదే లే అంటున్నారు. హీరోయిన్లు ఒకప్పటి గ్లామర్ డాల్స్ కాదు.. ఒక వైపు బ్యూటి ఫుల్ రోల్స్ చేస్తూనే పర్ ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. అందుకే వాళ్లకంటూ ఓ మార్కెట్, స్పెషల్ ఫాన్ బేస్, స్క్రీన్ స్పేస్ సంపాదించుకుని హీరోలతో పోటీకొస్తున్నారు.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ వైజ్ టాప్ రేంజ్ లోఉన్న సమంత.. తనకంటూ సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసుకుంది. ఎంటర్ టైన్ మెంట్, విమెన్ సెంట్రిక్ మూవీస్ నుంచి వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ వరకూ ఇలా తన మార్కెట్ ని రోజురోజుకీ పెంచుకుంటోంది సమంత. పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్ తో సమంత ఆడియన్స్ ని పుల్ చేసిందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఒకవైపు సమంత లవ్ రొమాంటిక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పవర్ ఫుల్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలతో పాటు సమంత సినిమాలు కూడా ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కాతువాకుల రెండు కాదల్ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలతో పాటు గుణ శేఖర్ శాకుంతలం, యశోదతో పాటు అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిస్తూ హీరోల క్రేజ్ ని చేజ్ చేసే పనిలో బిజీగా ఉంది సమంత.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

ప్రజెంట్ సౌత్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మిక. వరసగా సూపర్ హిట్లుకొడుతున్న ఈ కన్నడ కస్తూరి.. పుష్పతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తర్వాత సినిమాలో మెయిన్ క్యారెక్టర్ రష్మికనే కనిపిస్తుంది. అంత స్క్రీన్ స్పేస్ తో పాటు.. తన పర్ ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేసి.. సినిమా మీద క్రేజ్ మరింత పెంచేసుకుంది. ఆ క్రేజ్ సౌత్ దాటి బాలీవుడ్ లో బలంగా పాతుకుపోయింది.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక.. తెలుగులో కూడా వరసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు.. తనకున్న క్రేజ్ తో ఆడియన్స్ ని ధియేటర్లకు రప్పించగలదన్న నమ్మకంతో మేకర్స్ కూడా.. అంత స్టార్ డమ్ లేని హీరోలతో రష్మిక ని హైలెట్ చేస్తున్నారు. రష్మిక మందాన ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోలతో పాటు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సంపాదిస్తోంది. శర్వానంద్ తో చేస్తున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాలో స్పేస్ ఎక్కువ తీసుకుని హైలెట్ అవుతోంది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

నిన్న కాక మొన్నొచ్చి వరుసపెట్టి హిట్లు కొడుతున్న పూజాహెగ్డే కూడా హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటోంది. అంతేకాదు .. చిన్న హీరోలతో చేస్తున్న సినిమాలకు తనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. పూజా ఉంటే.. సినిమా హిట్టే అనే టాక్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ కొట్టేస్తోంది. అంతేకాదు.. నా సినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి తన కున్న క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసింది.