Bollywood Exhibitors : సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్ళం..

ప్రముఖ ఎగ్జిబిటర్‌ మనోజ్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఒక పాన్-ఇండియా సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. KGF చాప్టర్ 2 మా థియేటర్స్ లో....

Bollywood Exhibitors : సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్ళం..

South

Bollywood Exhibitors :  ఇటీవల కాలంలో వరుసగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి సినిమాలన్నీ అక్కడ భారీ విజయం సాధిస్తున్నాయి. సౌత్ సక్సెస్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది. సౌత్ సినిమాల సక్సెస్ పై బాలీవుడ్ లోని కొంతమంది స్టార్లు అసహనం వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సౌత్ సినిమాల్లో భాగం కావాలని అనుకుంటున్నారు.

కరోనా వల్ల సినీ పరిశ్రమ, సినిమా పంపిణీదారులు, థియేటర్ వాళ్ళు అంతా తీవ్రంగా నష్టపోయారు. అన్ని చోట్ల ఈ పరిస్థితి ఎదురయింది. చాలా మంది థియేటర్లు క్లోజ్ చేసుకొని వేరే బిజినెస్ లు కూడా చూసుకున్నారు. అయితే కరోనా తర్వాత వచ్చిన సౌత్ సినిమాలు సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఎగ్జిబిటర్‌లు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక సౌత్ సినిమాలని పొగుడుతున్నారు. సౌత్ సినిమాల వల్లే కలెక్షన్స్ బాగా వచ్చాయి, లాభాలు వచ్చాయి, కరోనా నుంచి రికవర్ అయ్యాము అంటున్నారు బాలీవుడ్ పంపిణీదారులు.

Shiva Jyothi : మీకో దండంరా బాబు నేను ప్రెగ్నెంట్ కాదు..

తాజాగా G7 మల్టీప్లెక్స్ మరియు మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ ఎగ్జిబిటర్‌ మనోజ్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ”ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఒక పాన్-ఇండియా సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. KGF చాప్టర్ 2 మా థియేటర్స్ లో హౌస్‌ఫుల్‌గా ఉంది. సాధారణంగా ఐపీఎల్‌ టైంలో కలెక్షన్స్‌ తగ్గుతాయి. కానీ ఈ సారి సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇటీవల విడుదల అయిన సౌత్ సినిమాలు అద్భుతమైన వ్యాపారం చేసి కరోనా మహమ్మారి తర్వాత ఎగ్జిబిటర్‌లు తిరిగి పుంజుకోవడానికి చాలా సహాయపడ్డాయి. ఇటీవలే మా వ్యాపారం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. కరోనాతో సినిమాలు లేక, ఇక్కడ ఉన్న సినిమాలు విజయం సాధించక రోడ్డునపడ్డ మాకు సహాయం చేసిన KGF 2, RRR, పుష్ప లాంటి సినిమాలకి మా కృతజ్ఞతలు. సౌత్ సినిమాల లాగా ఆడే హిందీ సినిమాలు మాకు కావాలి. ఇటీవలి కాలంలో విడుదలైన సౌత్ సినిమాలు లేకపోతే మేమంతా రోడ్డున పడేవాళ్ళం” అని తెలిపారు. ఇలా బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ సినిమాలని పొగడటంతో సౌత్ సినీ పరిశ్రమకి మరింత కిక్కిస్తుంది.