Bollywood Remakes: రీమేక్ మాయలో బాలీవుడ్.. సౌత్ కంటెంట్ కావాలంటున్న స్టార్స్!

బాలీవుడ్ లో కథల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అందరికీ నచ్చేస్తున్న సౌత్ కంటెంట్ పై మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు. మరో పది ప్రాజెక్టులను పైప్ లైన్ లో పెట్టారు.

Bollywood Remakes: రీమేక్ మాయలో బాలీవుడ్.. సౌత్ కంటెంట్ కావాలంటున్న స్టార్స్!

Bollywood Remakes

Bollywood Remakes: బాలీవుడ్ లో కథల కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అందరికీ నచ్చేస్తున్న సౌత్ కంటెంట్ పై మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అందులో భాగంగానే ఓ 25 సౌత్ సినిమాలను రీమేక్ చేసేస్తున్నారు. మరో పది ప్రాజెక్టులను పైప్ లైన్ లో పెట్టారు. బాలీవుడ్ బిగ్ స్టార్స్ నుంచి చోటా హీరోల వరకు ఇలా రీమేక్ మాయలో పడి బాలీవుడ్ ఒరిజినాలిటీని దెబ్బతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే రీమేక్ స్టార్స్ గా మారుతున్న వారెవరో ఓసారి చూద్దాం.

Bollywood Remakes: బాలీవుడ్ డిజాస్టర్ రీమేక్స్.. సౌత్ రీమేక్స్‌కి దక్కని ఆదరణ!

సౌత్ ముఖ్యంగా తమిళ్, తెలుగు, మలయాళ సినిమాల రీమేక్స్ తో బాలీవుడ్ కళ కళ లాడుతోంది. ప్రజెంట్ అక్కడ సెట్స్ పై ఉన్న సినిమాలు మాక్సిమమ్ ఇక్కడి కథలతో రూపొందుతున్నవే. అంతేందుకు ఈమధ్యే రిలీజ్ అయిన బచ్చన్ పాండే, జెర్సీ కూడా దక్షిణాది రీమేక్సే కదా. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ డం ఉన్న హీరో కూడా సౌత్ కథలు కావాలంటున్నారు. అన్ని రకాల ఆడియెన్స్ కు కనెక్ట్ కావాలంటే సౌత్ స్టోరీలే మేలనుకున్న అక్షయ్ వరుసగా ఇక్కడి కథలను ఓకే చేస్తున్నాడు. రీసెంట్ గా సూర్య సూరారై పోట్రుకు కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. ఒరిజనల్ డైరెక్టర్ సుధా కొంగరనే దీనిని డైరెక్ట్ చేస్తోంది.

Bollywood Movies: ఈ వారం థియేటర్లలోకి అజయ్, టైగర్.. యష్ ముందు నిలబడగలరా?

ఒరిజనల్ తమిళ్ థ్రిల్లర్ రాక్షసన్ కూడా అక్షయ్ లిస్ట్ లో ఉంది. మిషన్ సిండ్రిల్లా పేరుతో ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మరోవైపు ఈమధ్యే మలయాళీ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ ను పట్టాలెక్కించాడు అక్షయ్. ఇందులో ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. తారక్ ఊసరవెల్లిని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు బాలీవుడ్ ఖిలాడీ.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

తమిళ్ లో సక్సెసైన విక్రమ్ వేదాను హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా సేమ్ డైరెక్టర్స్ గాయత్రి పుష్కర్ రీమేక్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో ఇదే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు హృతిక్. ఇక కొన్నేళ్ల క్రితం రిలీజైన సౌత్ బ్లాక్ బస్టర్ అపరిచితుడును రణ్ వీర్ సింగ్ హీరోగా శంకర్ తెరకెక్కించబోతున్నాడు. రామ్-పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పై కూడా రణ్ వీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

Bollywood Exhibitors : సౌత్ సినిమాలు లేకపోతే రోడ్డున పడేవాళ్ళం..

సౌత్ కంటెంట్ విషయంలో అక్షయ్ దేవగణ్ కూడా తగ్గేదేలే అంటున్నాడు. కార్తీ లీడ్ రోల్ చేసిన ఖైదీని రీసెంట్ గా భోళా పేరుతో అజయ్ స్టార్ట్ చేశాడు. అల్లరి నరేశ్ కు ఈమధ్య హిట్ ఇచ్చిన నాంది సినిమాను కూడా అక్షయ్ దేవగణ్ తన అకౌంట్ లో వేసుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మలయాళీ రీమేక్ దృశ్యం2 కూడా దేవగణ్ చేతిలో ఉంది.

Bollywood Heroins: సౌత్ బాటలో బీటౌన్ హీరోయిన్స్.. కేరాఫ్ టాలీవుడ్!

గతేడాది సంక్రాంతికొచ్చిన విజయ్ మాస్టర్ మూవీపై కూడా బాలీవుడ్ కన్నేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా మాస్టర్ ను రీమేక్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మలయాళీ హిట్ అయ్యప్పనుమ్ కోషియమ్ ఈ ఏడాది తెలుగులో భీమ్లానాయక్ గా వచ్చి ఇక్కడా హిట్ కొట్టింది. ఇప్పుడీ ఈ మూవీని అర్జున్ కపూర్, జాన్ అబ్రహం లీడ్ రోల్స్ లో తెరకెక్కించబోతున్నారు. ఇక రణ్ వీర్ సింగ్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్ లీడ్ రోల్స్ లో ఎఫ్2ను రీమేక్ చేసేందుకు బోనీ కపూర్ తో కలిసి చర్చలు జరుపుతున్నారు దిల్ రాజు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

అల్లు అర్జున్ సినిమాలకు బాలీవుడ్ లో భలే గిరాకీ ఉంది. ఆల్రెడీ అల వైకుంఠపురంలో రీమేక్ షెహ్ జాదా కార్తీక్ ఆర్యన్ హీరోగా సెట్స్ పై ఉంది. త్వరలోనే సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా దువ్వాడ జగన్నాథమ్ ను రీమేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసే అవకాశముంది. అంతేకాదు మిథున్ చక్రవర్తి కొడుకు నమషి చక్రవర్తి హీరోగా త్రివిక్రమ్ బన్నీ జులాయి రీమేక్ పూర్తి కావొస్తుంది.

Bollywood Directors: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. యంగ్ డైరెక్టర్ల మిస్ ఫైర్!

శ్రీవిష్ణు, నివేధా థామస్ నటించిన బ్రోచేవారెవరురా సినిమా రీమేక్ రైట్స్ ను అజయ్ దేవగణ్ సొంతం చేసుకున్నాడు. త్వరలోనే కరణ్ దేవోల్, అభయ్ డియోల్ హీరోలుగా ఈ రీమేక్ ప్రారంభించబోతున్నారు. రవితేజ క్రాక్ కోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. సోనూ సూద్ హీరోగా క్రాక్ రీమేక్ రాబోతుందని టాక్. తమిళ్ హిట్ డి 16 వరుణ్ ధావన్ హీరోగా రీమేక్ అవుతోంది. ఎప్పటినుంచో దీపికా పదుకోన్ ను అరుంధతిగా చూడాలని బాలీవుడ్ కలలు కంటోంది. అల్లు అరవింద్, మధు మంతెన కలిసి బాలీవుడ్ కి అరుంధతిని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

సందీప్ కిషన్ మా నగరం సినిమాను హిందీలో విక్రాంత్ మెస్సీ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఆయన హీరోయిన్ గా సౌత్ హిట్ యూ టర్న్ మూవీని ఏక్తాకపూర్ రీమేక్ చేస్తోంది. నయనతార లేడీ లీడ్ గా కనిపించిన కొలమవు కోకిలను జాన్వీకపూర్ హీరోయిన్ గా రూపొందిస్తున్నారు. ఇక అర్జున్ కపూర్ హీరోగా తమిళ్ కోమలి.. ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్ లో తథమ్ రీమేక్.. మలయాళం నుంచి ది గ్రేట్ ఇండియన్ కిచెన్, హెలెన్, ఫోరెన్సిక్, హృదయం లాంటి ప్రాజెక్టులు కూడా బాలీవుడ్ లో క్యూ కట్టాయి.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

రాజ్ కుమార్ రావ్ హీరోగా విశ్వక్ సేన్ హిట్ రీమేక్ రాబోతుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్. రీమేక్ సినిమాలతో దిల్ రాజు బాలీవుడ్ లో ఇలా బిజీగా మారుతున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా బాలీవుడ్ జనాల ముందుకు వెళ్లబోతుంది. అందులోనూ నవీన్ పొలిశెట్టినే కనిపించే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు సూపర్ హిట్ సినిమాలను బాలీవుడ్ లో తాను హీరోగా చూపించబోతున్నాడు బెల్లంకొండ సురేశ్. ఇప్పటికే ఛత్రపతి చేస్తోన్న బెల్లంకొండ.. త్వరలోనే తారక్ ఆదిని రీమేక్ చేస్తాడనే ప్రచార జరుగుతోంది.