Bollywood Remakes: బాలీవుడ్ డిజాస్టర్ రీమేక్స్.. సౌత్ రీమేక్స్‌కి దక్కని ఆదరణ!

ఆడియన్స్ కి కావల్సింది కొత్త కంటెంట్. ఒక చోట హిట్ అయ్యింది కదా అని.. అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, హిట్ అవుతుందని రూల్ లేదు. సేమ్.. ఈ రిజల్ట్ నే ఫేస్ చేస్తోంది బాలీవుడ్.

Bollywood Remakes: బాలీవుడ్ డిజాస్టర్ రీమేక్స్.. సౌత్ రీమేక్స్‌కి దక్కని ఆదరణ!

Bollywood Remakes

Bollywood Remakes: ఆడియన్స్ కి కావల్సింది కొత్త కంటెంట్. ఒక చోట హిట్ అయ్యింది కదా అని.. అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, హిట్ అవుతుందని రూల్ లేదు. సేమ్.. ఈ రిజల్ట్ నే ఫేస్ చేస్తోంది బాలీవుడ్. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు. ఇంతకీ సౌత్ రీమేక్స్ ని బాలీవుడ్ తిరస్కరిస్తోందా..?

Bollywood Remakes: 25 తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్!

ఈ మధ్య బాలీవుడ్ లో హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాల గురించి, సౌత్ నటుల గురించే టాపిక్ నడుస్తోంది. అంతేకాదు.. సౌత్ సినిమాల రీమేక్ లు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. సౌత్ లో హిట్ అయిన సినిమాల్ని ఓటీటీ లోనో, డబ్బింగ్ చేసో రిలీజ్ చెయ్యడంతో ఆల్రెడీ జనాలు సినిమా చూసేస్తున్నారు. కానీ సబ్జెక్ట్ బావుంది కదా అని రీమేక్ చేస్తే మాత్రం.. డిజాస్టర్ ఫేస్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జెర్సీ మూవీ మినిమం కలెక్షన్లు కూడా లేక.. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెర్సీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ షాహిద్ కపూర్ రీమేక్ చేసిన జెర్సీ మాత్రం డీసెంట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ చూసి రామ్ గోపాల్ వర్మ అయితే.. 10 లక్షలతో డబ్బింగ్ చేస్తే సరిపోయేది కానీ.. 100 కోట్లు పెట్టి మళ్ళీ రీమేక్ చెయ్యాలా..? ఇదేం తెలివి తక్కువ పని అంటూ సోషల్ మీడియాలో ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

Bollywood Remakes: తెలుగు కథలకు బాలీవుడ్ ఫిదా.. రీమేక్స్ దండయాత్ర షురూ!

ఎంతో ఎక్స్ పెక్ట్ చేసి సౌత్ లో హిట్ అయిన సినిమాల్ని రీమేక్ చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ మాత్రం నష్టాలపాలవుతున్నారు. ఎందుకంటే.. ఆల్రెడీ సబ్ టైటిల్స్ తోనే, ఓటీటీలోనో ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి చూసిన సినిమాని వేరే స్టార్ కాస్ట్ తో మళ్లీ చెయ్యడం, చూడడం అవసరమా అని ఫీలవుతున్నారు ఆడియన్స్. అందుకే వరసగా ఫ్లాప్ అవుతున్నాయి సౌత్ రీమేక్ మూవీస్. అక్షయ్ కుమార్ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ చేసిన బచ్చన్ పాండే అసలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తమిళ్ లో జిగర్తాండా, తెలుగులో గద్దల కొండ గణేష్ గా తెరకెక్కిన సినిమాని హిందీలో బచ్చన్ పాండే గా రీమేక్ చేశారు అక్షయ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చెయ్యలేక డిజాస్టర్ అయ్యింది బచ్చన్ పాండే.

Telugu Remakes: మలయాళ రీమేక్ అడ్డాగా టాలీవుడ్.. అలా కలిసిసొస్తుందంతే!

అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చేలేదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన లారెన్స్ కాంచన మూవీని హిందీలో లక్ష్మిగా రీమేక్ చేశారు అక్షయ్. సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా హిందీ రీమేక్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయ్యినా.. అక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకోలేకపోయింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సౌత్ రీమేక్ ఫ్లాప్స్ రావడంతో అక్షయ్ కుమార్ మొన్నీమధ్య స్టార్ట్ చేసిన సూర్య మూవీ ఆకాశమే నీహద్దురా రీమేక్ మీద విపరీతంగా ట్రోల్ చేశారు ఫాన్స్. ఆల్రెడీ చూసేసిన సినిమాలు మళ్లీ రీమేక్ చెయ్యొద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు నెటిజన్స్.