Telugu Remakes: మలయాళ రీమేక్ అడ్డాగా టాలీవుడ్.. అలా కలిసిసొస్తుందంతే!

మాలీవుడ్ ఇప్పుడు రీమేక్ అడ్డా అయిపోయింది. చిన్న ఇండస్ట్రీ అయినా పెద్ద సక్సెస్ లు కొడుతున్న మళయాళ సినిమాలకు ఇంప్రెస్ అయిపోయిన టాలీవుడ్ అక్కడి సినిమాల్ని వరుస పెట్టి రీమేక్ చేస్తోంది

Telugu Remakes: మలయాళ రీమేక్ అడ్డాగా టాలీవుడ్.. అలా కలిసిసొస్తుందంతే!

Telugu Remakes

Telugu Remakes: మాలీవుడ్ ఇప్పుడు రీమేక్ అడ్డా అయిపోయింది. చిన్న ఇండస్ట్రీ అయినా పెద్ద సక్సెస్ లు కొడుతున్న మళయాళ సినిమాలకు ఇంప్రెస్ అయిపోయిన టాలీవుడ్ అక్కడి సినిమాల్ని వరుస పెట్టి రీమేక్ చేస్తోంది. కలిసొచ్చిన మళయాళ రీమేక్స్ తో వరస పెట్టి సూపర్ హిట్లు కొడుతున్నారు మన స్టార్ హీరోలు.

Bollywood Remakes: 25 తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్!

మళయాళ సినిమాలు మనకు బాగా కలిసొస్తున్నాయి. అక్కడ నుంచి అరువు తెచ్చుకుని మన స్టార్ హీరోలు తెరకెక్కించిన రీమేక్ సినిమాలు అదిరిపోయే సక్సెస్ అవుతున్నాయి. పవన్ -రానా కాంబినేషన్లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లా నాయక్ రికార్డులు బద్దలుకొడుతోంది. మళయాళంలో పృథ్విరాజ్, బిజు మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్.. పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది.

Bollywood Remakes: తెలుగు కథలకు బాలీవుడ్ ఫిదా.. రీమేక్స్ దండయాత్ర షురూ!

తమ్ముడు కంటే ముందే.. మళయాళ రీమేక్ మూవీని లైన్లో పెట్టారు అన్న మెగాస్టార్. మళయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ లూసిఫర్ ని మోహన్ రాజాతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. గాడ్ ఫాదర్ టైటిల్ తో పర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ మళయాళ రీమేక్ పై ఇప్పటికే విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!

ఇప్పుడే కాదు.. అంతకుముందు కూడా తెలుగు హీరోలు మళయాళం రీమేక్స్ తో మంచి హిట్స్ అందుకున్నారు. టాలీవుడ్ లో ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉండే వెంకటేష్ కూడా కంటెంట్ నచ్చితే భాషతో సంబందం లేకుండా రీమేక్ చేస్తారు. అలా మోహన్ లాల్ నటించిన మళయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2ని జస్ట్ 45 రోజుల్లోనే కంప్లీట్ చేసేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఫస్ట్ పార్ట్ ని మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది దృశ్యం 2.

Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

మాస్ కా దాస్ అంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్వక్ సేన్ కి ఆరేంజ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది మళయాళ రీమేక్ మూవీయే. అంగమలై డైరీస్ అనే మళయాళ సినిమాని ఫలక్ నుమా దాస్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి కెరీర్ లో మంచి హిట్ అందుకున్నాడు విష్వక్ సేన్. వీటితో పాటు యంగ్ హీరో సత్యదేవ్ కి కెరీర్ లో లిఫ్ట్ ఇచ్చిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. మహేషింతే ప్రతీకారం టైటిల్ తో మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని సత్యదేవ్ హీరోగా తెలుగులో కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ చేసి మంచి హిట్ అందుకున్నారు.

Prabhas: చేతినిండా సినిమాలు.. ప్రభాస్ ప్లానింగ్ అదుర్స్ అంతే!

రీసెంట్ గా మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఆండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25. ఈ కామెడీకి సెంటి మెంట్ ని యాడ్ చేసి తండ్రీ కొడుకుల రిలేషన్ ని చాలా రియల్ గా చూపించిన ఈ సినిమా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లోనే మోహన్ బాబు రీమేక్ చేస్తున్నారు.

Jana Gana Mana: రౌడీతో పూరీ ర్యాపో.. అప్పుడే సెట్స్‌పైకి జనగణమన!

మళయాళంలో సూపర్ హిట్ అయిన మరో మూవీ నాయట్టుతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అనే మరో ఇంట్రస్టింగ్ సినిమా రైట్స్ ని మెగాఫ్యామిలీ తీసుకున్నారు. మళయాళం సూపర్ హిట్ అయిన కప్పెళ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ రీమేక్ చేస్తోంది. యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ, అర్జున్ దాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శౌరి చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు హెలెన్ అనే మరో విమెన్ సెంట్రిక్ మళయాళ థ్రిల్లర్ మూవీని అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో రీమేక్ చెయ్యడానికి పీవీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఇలా వరసగా హిట్లు ఇస్తూ.. కలిసొస్తున్న మళయాళ సినిమాల్ని రీమేక్ చెయ్యడానిక తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మన స్టార్లు.