Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

పునీత్ కూడా గుండెపోటుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమకి గుండెపోటు శాపం అన్నట్టు మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కన్నడ సినీ పరిశ్రమ వాళ్ళు గుండెపోటుతోనే మరణించడం ఇందుకు

Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

Kannada

Kannada Industry :  నిన్న ఉదయం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరి చికిత్స అందిస్తుండగా మరణించారు. ఆయన మరణం కన్నడ సినీ పరిశ్రమకి తీరని నష్టం. ఆయన మరణంతో కర్ణాటక ప్రజలు శోక సంద్రంలోకి వెళ్లిపోయారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించడం చర్చాంశనీయమవుతుంది. చిన్న వయసులోనే ఇలా గుండెపోటు వచ్చి మరణించడం అందర్నీ బాధకి గురి చేస్తుంది. పునీత్ కూడా గుండెపోటుతో మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమకి గుండెపోటు శాపం అన్నట్టు మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కన్నడ సినీ పరిశ్రమ వాళ్ళు గుండెపోటుతోనే మరణించడం ఇందుకు కారణం.

Rashmika : రష్మికతో అంతర్వేది ఆలయంలో శర్వానంద్

కన్నడ సీనియర్ డైరెక్టర్/ యాక్టర్ సత్యజిత్ కూడా ఇటీవల గుండెపోటుతో మరణించారు. గత సంవత్సరం కూడా ఎంతో మంది ఆర్టిస్టులని కన్నడ పరిశ్రమ కోల్పోయింది. అందులో కూడా చాలా మంది గుండెపోటుతోనే మరణించడం విషాదం. గత సంవత్సరం మరో కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా కూడా చిన్న వయసులోనే గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. చికిత్స అందిస్తుండగా మరణించారు. సీనియర్ యాక్టర్ కొడంగనూర్ జయకుమార్ కూడా గుండెపోటుతో మరణించారు. మరో ఆర్టిస్ట్ సిద్దరాజ్ కల్యాణకర్ గత సంవత్సరం సెప్టెంబర్ లో గుండెపోటుతో మరణించారు. కన్నడలో కమెడియన్, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన రాక్ లైన్ సుధాకర్ కూడా గుండెపోటుతోనే మరణించారు. కన్నడ కమెడియన్ మైకేల్ మధు కూడా గత సంవత్సరం మేలో హార్ట్ అటాక్ తోనే మరణించారు. గతంలో కన్నడ మెగాస్టార్ విష్ణు వర్ధన్ కూడా గుండెపోటుతోనే మరణించడం బాధాకరం.

ఒక్కడు, దూకుడు, ఆంధ్రావాలా… Puneeth Rajkumar తెలుగు రీమేక్స్..

పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం గుండెపోటుకు గురయ్యారు. అదృష్టవశాత్తు చికిత్స అందించగా కోలుకున్నారు. ఇలా కన్నడ సినీ పరిశ్రమలో చాలా మంది గుండెపోటుతో మరణించడం ఇప్పుడు చర్చలకు దారి తీస్తుంది. కన్నడ పరిశ్రమకి గుండె పోటు శాపంగా మారిందా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా తమ అభిమాన సెలబ్రిటీలు ఇలా అనుకోకుండా హార్ట్ అటాక్ తో మరణించడం అభిమానులు భరించలేకున్నారు.