ఒక్కడు, దూకుడు, ఆంధ్రావాలా… Puneeth Rajkumar తెలుగు రీమేక్స్..

పునీత్ కు టాలీవుడ్ తోనూ రిలేషన్ ఉంది. ఇక్కడ నందమూరి, మెగా కుటుంబాలతో పునీత్ రాజ్ కుమార్‌కు మంచి స్నేహం ఉంది. కేవలం ఈయనతో ఉన్న స్నేహం కోసమే జూనియర్ ఎన్టీఆర్..

ఒక్కడు, దూకుడు, ఆంధ్రావాలా… Puneeth Rajkumar తెలుగు రీమేక్స్..

Puneeth Rajkumar Telugu Remakes

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని భారతీయ సినీ పరిశ్రమల్లోనూ తీవ్ర విషాదం నింపింది. పునీత్ రాజ్ కుమార్ అకాల మృతితో అభిమానులు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. బోరున విలపిస్తున్నారు. వారు ఇంకా షాక్ లోనే ఉన్నారు. 46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్ ఇక లేడనే వార్తను ఇంకా నమ్మలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మరణించారు. 46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

కాగా, పునీత్ కు టాలీవుడ్ తోనూ రిలేషన్ ఉంది. ఇక్కడ నందమూరి, మెగా కుటుంబాలతో పునీత్ రాజ్ కుమార్‌కు మంచి స్నేహం ఉంది. కేవలం ఈయనతో ఉన్న స్నేహం కోసమే జూనియర్ ఎన్టీఆర్.. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో ఒక పాట పాడాడు. ఇక మహేశ్‌ బాబు కూడా పునీత్ రాజ్ కుమార్ నటించిన ఒక సినిమా ఆడియో వేడుకకు వెళ్లాడు. చిరంజీవి కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పునీత్. ఆయన అన్న శివ రాజ్ కుమార్ కూడా తెలుగు హీరోలకు బాగా తెలుసు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమా కన్నడలో అజయ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఆ ఇష్టమే Puneeth Rajkumar ప్రాణం తీసిందా? మృతికి అసలు కారణం అదేనా?

అలాగే అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, ఆంధ్రావాలా లాంటి సినిమాలను కన్నడలో రీమేక్ చేశాడు పునీత్ రాజ్ కుమార్. తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన ఆంధ్రావాలా సినిమా కన్నడలో వీర కన్నడిగ పేరుతో రీమేక్ చేయగా సూపర్ హిట్ అయింది. అక్కడ ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఒకే ఒక్క కారణం పునీత్ కు ఉన్న ఫాలోయింగ్. కేవలం ఇది మాత్రమే కాదు మరికొన్ని తమిళ సినిమాలు కూడా రీమేక్ చేశాడు పునీత్. ఒరిజినల్ కంటే కన్నడలో అవి మరింత పెద్ద విజయం సాధించాయి. దానికి తోడు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం శాండల్ వుడ్ కు తీరని లోటు.

కన్నడ సూప‌ర్ స్టార్ రాజ్‌ కుమార్ మూడో కుమారుడే పునీత్ రాజ్ కుమార్. పునీత్ అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్. సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నారు. బాలనటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించారు. పునీత్ పుడుతూనే స్టార్. ఎదుగుతున్న క్రమంలో తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డారు. ఆయన జీవితం క్రమశిక్షణతో సాగింది.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలే చేశారు పునీత్. ఈ క్ర‌మంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్‌ రాజ్‌కుమార్‌. చివరగా యువరత్న సినిమాలో నటించారు. కన్నడ చిత్ర సీమ‌లో ఏ హీరోకి లేని ఘనత కూడా పునీత్ రాజ్ కుమార్ కే ద‌క్కింది. ఆయ‌న చిత్రాల‌న్ని కన్నడలో సూప‌ర్ హిట్లుగా నిలిచిపోయాయి.