Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..
ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు, స్టార్ హీరో తమ్ముడు అయినా కూడా ఆయన చాలా సామాన్యంగా ఉంటారనేది అందరూ చెప్పేమాట..

Puneeth Rajkumar Donated His Eyes
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్‌కు భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు.
Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..
పునీత్ మరణంతో కర్ణాటక అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం కంఠీరవ స్టూడియోలో తండ్రి సమాధి పక్కనే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..
పునీత్ రాజ్ కుమార్ కన్నుమూస్తూ కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని తన కళ్లకు దానం చేశారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో తండ్రి రాజ్ కుమార్ కూడా కళ్లు డొనేట్ చేశారు. పునీత్ పలు ఐ క్యాంపెయిన్లలో కూడా పాల్గొన్నారు.
Puneeth Rajkumar : అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..
ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు, స్టార్ హీరో తమ్ముడు అయినా కూడా ఆయన చాలా సామాన్యంగా ఉంటారనేది అందరూ చెప్పేమాట. పునీత్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 45 ఫ్రీ స్కూళ్లు, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు అలాగే 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందించారు పునీత్. ఎన్నో బాధ్యతలతో, సామాజిక సృహతో నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా చెరగని ముద్ర వేసిన పునీత్ తన కళ్లను దానం చేశారు.
Puneeth Rajkumar : తండ్రి సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు