Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు..

Kanada Star Punith Raj
Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్‌కు భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. శుక్రవారం ఉదయం 9:45 గంటలకు ఇంట్లో జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.
Puneeth Rajkumar : పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అభిమానుల్లో ఆందోళన..
గతంలో పునీత్ అన్నయ్య కన్నడ సూపర్ స్టార్, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యారు. ఇప్పుడు తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కూడా అలాగే జిమ్ చేస్తూ గుండెపోటుకి గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Puneeth Rajkumar : అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..
పునీత్ చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు, కన్నడ సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చే సమయానికే పునీత్ పరిస్థితి విషమంగా ఉందని.. ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు.
Jai Bhajarangi : ‘కె.జి.యఫ్’ రేంజ్‌లో శివన్న ‘జై భజరంగి’
పునీత్ మృతితో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆసుపత్రితో పాటు ప్రధాన మార్గాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్ చేశారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పునీత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Dhanya Ramkumar : కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజ్ కుమార్ మనవరాలు..