Jai Bhajarangi : ‘కె.జి.యఫ్’ రేంజ్‌లో శివన్న ‘జై భజరంగి’

‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘భజరంగి 2’ తెలుగులో ‘జై భజరంగి’ పేరుతో విడుదల కానుంది..

Jai Bhajarangi : ‘కె.జి.యఫ్’ రేంజ్‌లో శివన్న ‘జై భజరంగి’

Jai Bhajarangi

Updated On : October 17, 2021 / 3:14 PM IST

Jai Bhajarangi: ‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం ‘భజరంగి 2’. ‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013లో కర్ణాటక రాష్ట్రంలో 212 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలం సృష్టించింది.

Bhajarangi

ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’ తెలుగులో ‘జై భజరంగి’ గా అక్టోబర్ 29న విడుదల అవుతుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ బాలాజీ వీడియో అధినేత నిరంజన్ పన్సారి ‘జై భజరంగి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Keerthy Suresh : హ్యాపీ బర్త్‌డే కీర్తి సురేష్

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ: ‘‘గత 35 ఏళ్లుగా వీడియో రంగంలో ఉన్న ప్రసిద్ధ సంస్థ శ్రీ బాలాజీ వీడియో ఇప్పటి వరకు సుమారు 400 చిత్రాలకు పైగా వీడియో హక్కులను పొందింది. మేమిచ్చే వీడియో క్వాలిటీని గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగులో ‘మగధీర’ సినిమాతో బ్లూ రే డిస్క్‌ని మా సంస్థ ద్వారా పరిచయం చేసాం. అదే విధంగా మేము స్థాపించిన శ్రీ బాలాజీ మూవీస్ యూట్యూబ్ ఛానల్‌కి కూడా 1 కోటి 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

ఇప్పుడు డా. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జై భజరంగి’ చిత్రంతో టాలీవుడ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. 2013లో కన్నడ భాషలో విడుదలైన ‘భజరంగి’ శివ రాజ్ కుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఆ సక్సెస్‌ని పురస్కరించుకుని ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ‘భజరంగి 2’ ని ‘జై భజరంగి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.