Puneeth Rajkumar : తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ రాజ్ కుమార్ అంత్యక్రియలు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. తండ్రి సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Puneeth Rajkumar : తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ రాజ్ కుమార్ అంత్యక్రియలు

Puneeth Rajkumar Body At Kanteerva Stadium For Final Respects

Puneeth Rajkumar Final Respects : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తున్న సమయంలో ఆయనకు ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచారు. పునీత్ 46ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మరణించడంతో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ మృతితో కర్ణాటకలో హైఅలర్ట్ ప్రకటించారు. పునీత్ మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు బోరుమని విలపిస్తున్నారు.

పునీత్ పార్దీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. విక్రమ్ ఆస్పత్రి నుంచి పునీత్ పార్దీవదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు. 2021, అక్టోబర్ 30వ తేదీ (శనివారం)నాడు తండ్రి సమాధి దగ్గరే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను కూడా నిర్వహించనున్నారు. పునీత్ కుమార్తె వందితా రాజ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కూతురు వచ్చిన తరువాత పునీత్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
Actor Puneeth Rajkumar : కర్నాటక హై అలర్ట్, థియేటర్లు మూసివేత

పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో కర్నాటక దిగ్ర్భాంతికి గురైంది. పునీత్ రాజ్ కుమార్ మృతిని కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక్ అధికారికంగా ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. అయితే తమ పవర్ స్టార్ ఇక లేరని, ఆయన సినిమాలు మరలా చూడమని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

దీంతో కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆసుపత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాండల్ వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్నాటక సర్కార్ ఆదేశించింది. పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బెంగుళూరు అంతగా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పునీత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..