Actor Puneeth Rajkumar : కర్నాటక హై అలర్ట్, థియేటర్లు మూసివేత
పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్నాటక సర్కార్ ఆదేశించింది.

Punith
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠత్ మరణం చెందడంతో కర్నాటక దిగ్ర్భాంతికి గురైంది. పునీత్ రాజ్ కుమార్ మృతిని కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక్ అధికారికంగా ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓదార్చారు. అయితే తమ పవర్ స్టార్ ఇక లేరని, ఆయన సినిమాలు మరలా చూడమని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read More : Rajinikanth : రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో కర్నాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆసుపత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాండల్ వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్నాటక సర్కార్ ఆదేశించింది.
Read More : Puneeth Rajkumar : షాక్‌లో సినీ ప్రముఖులు.. పునీత్‌కు కన్నీటి నివాళి..
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021, అక్టోబర్ 29వ తేదీ శుక్రవారం జిమ్ చేస్తుండగా…గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం…విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పునీత్ తుదిశ్వాస విడిచారు. సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు. మొదట సదాశివనగర్ లోని ఆయన ఇంటికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని తరలిస్తారు. 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం ప్రభుత్వ లాంచనాలతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.