Mesha Rasi Phalalu 2026 : మేష రాశి వారికి శుభవార్త.. ఈ ఏడాది కనక వర్షమే.. ఆ 4 నెలలు మీరు పట్టిందల్లా బంగారమే.. కానీ..!
Mesha Rasi Phalalu 2026 : 2026 ఉగాది నుంచి మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది.. ఎలాంటి ఫలితాలు చవి చూస్తారు అంటే..
Parabhava nama samvatsara ugadi panchangam 2026 mesha rasi phalalu Aries horoscope
మార్చి 19 పరాభవ నామ సంవత్సరం మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని.. కనక వర్షం కురుస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ సంవత్సరం మేష రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుందని చెబుతున్నారు. 12వ స్థానంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావం ఉంటుందని ఫలితంగా వినకూడని వార్తలు వినడం, మాట్లాడటం చేస్తారని చెబుతున్నారు. శని బాధ తగ్గడానికి ‘మయూరమాల’ ధరించడం, హనుమాన్ చాలీసా చదివితే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.
ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 7 అవమానం: 1
మేష రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు గురువు 3వ స్థానంలో (మిథునంలో) ఉండటం వల్ల స్థానచలనం, ధననష్టం, వృత్తిలో కష్టం ఉండవచ్చునని సూచిస్తున్నారు. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు: గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 4 నెలల కాలం (జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్) మేష రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం అని చెబుతున్నారు. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు చేయాలి. వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేసుకోవాలని సూచిస్తున్నారు. మేష రాశి వారికి శ్రావణంలో వివాహాలు కుదిరే అవకాశం ఉంది అంటున్నారు.
మేష రాశి వారికి అక్టోబర్ 31- జనవరి 24 వరకు గురువు సింహ రాశిలోకి (5వ ఇల్లు) రావడం వల్ల యోగకారకుడవుతాడు. ముఖ్యంగా డిసెంబర్ 21 వరకు పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెబుతున్నారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఆలోచనలు సరిగ్గా ఉండాలని చెబుతున్నారు.
ముఖ్యమైన పరిహారాలు:
- ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాలి.
- మయూరమాలతో పాటు నిత్యదర్శన యంత్రం దగ్గర ఉంచుకోవాలి.
- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని కాలినడకన దర్శించుకోవాలి. వివాహం కాని వారు శ్రీనివాస మంగాపురం నుండి కాలినడకన వెళ్లడం శ్రేయస్కరం.
కలిసి వచ్చే సమయం : అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 21 వరకు మేష రాశి వారికి అత్యంత కలిసి వచ్చే సమయం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
