Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!

హీరో-డైరెక్టర్.. క్రేజీ కాంబినేషన్స్ వెంటవెంటనే సెట్టవుతున్నాయి కానీ అందులో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అంత త్వరగా రివీల్ అవ్వట్లేదు. మా హీరో పక్కన ఈ భామైతే జోడీ అదిరిద్దని ఫ్యాన్స్..

Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!

Telugu Upcoming Films

Telugu Upcoming Films: హీరో-డైరెక్టర్.. క్రేజీ కాంబినేషన్స్ వెంటవెంటనే సెట్టవుతున్నాయి కానీ అందులో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అంత త్వరగా రివీల్ అవ్వట్లేదు. మా హీరో పక్కన ఈ భామైతే జోడీ అదిరిద్దని ఫ్యాన్స్ కలలు కంటుంటే.. కొందరు మేకర్స్ ఆ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తున్నారు. ఇంకొంతమందేమో ఊరించి ఉడికించి.. చివరికి అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని జంటను చూపిస్తున్నారు.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

స్టార్ హీరో-స్టార్ డైరెక్టర్ కాంబినేషన్స్ సూపర్ గా సెట్టవుతున్నాయి. కానీ అందులో హీరోయిన్ ఎవరన్నదానిపై మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్. కొంతమంది ముందు ఒకరి పేరు ప్రకటించి.. చివరికి వేరే అందగత్తెను తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పుడలాగే త్రివిక్రమ్-మహేశ్ బాబు సినిమాకు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముందు త్రివిక్రమ్ మూవీలో సూపర్ స్టార్ జోడిగా పూజా హెగ్డే అని అనౌన్స్ చేసారు కూడా. ఇప్పుడా బుట్టుబొమ్మ ప్లేస్ లో సమంతా సెట్టయ్యే అవకాశాలు ఉన్నాయి.

Prabhas: చేతినిండా సినిమాలు.. ప్రభాస్ ప్లానింగ్ అదుర్స్ అంతే!

తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాషల హద్దులేమి పెట్టుకొకుండా దూసుకుపోతున్న పూజా డేట్స్ అడ్జస్ట్ చేయలేక మహేశ్-త్రివిక్రమ్ కాంబోని వదులుకుంటే.. ఆ ఆఫర్ సామ్ క్యాచ్ చేసిందనే కబురు వినిపిస్తోంది. ఎలాగూ చైతో విడాకుల తర్వాత సామ్ వీలైనంత బిజీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాగూ డైరెక్టర్ త్రివిక్రమ్.. హీరో మహేశ్ బాబుతో ఆమెకు మంచి ర్యాపో వుంది. సో వెంటనే సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇక సేమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని.. ఆ రోల్ లావణ్య త్రిపాఠిని వరించిందనీ అంటున్నారు.

Bollywood Remakes: తెలుగు కథలకు బాలీవుడ్ ఫిదా.. రీమేక్స్ దండయాత్ర షురూ!

2022 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకెళ్లనున్నారు ఎన్టీఆర్-కొరటాల శివ. కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ లో నటించే హీరోయిన్ ఎవరన్నది చెప్పలేదు. కొరటాలతో కలిసి వర్క్ చేసిన కియారా అద్వానీనే తారక్ సరసన మెరుస్తుందనే ప్రచారం బాగా జరిగింది. తర్వాత ట్రిపుల్ ఆర్ బ్యూటీ అలియా భట్ ఎంట్రీ ఇస్తుందనీ అన్నారు. ఇక రీసెంట్ గా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్.. తారక్ జోడీగా అలరించబోతుందనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంతవరకు ఈ రూమర్స్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

పవన్ కల్యాణ్ సినిమాల్లో కూడా హీరోయిన్ ఎవరన్నది త్వరగా బయటికి చెప్పట్లేదు దర్శకనిర్మాతలు. ఎన్నో రూమర్స్ తర్వాత వకీల్ సాబ్ లో శృతీహాసన్, భీమ్లా నాయక్ లో నిత్యా మీనన్, హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పుడలాగే హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయబోయే పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ భవధీయుడు భగత్ సింగ్ లో ఏ బ్యూటీ నటిస్తుందన్నది సీక్రెట్ గా మారింది. మాక్సిమమ్ ఇందులో పూజా హెగ్డేకే ఆ అవకాశం దక్కనుంది. బుట్టబొమ్మ బర్త్ డే రోజు.. నీతో కలిసి పనిచేయడానికి ఎక్సైటింగ్ గా ఉన్నానని ట్వీట్ చేసాడు హరీశ్ శంకర్. దీంతో పవన్ సరసన పూజా ఫిక్సయినట్టేనని అర్ధమైంది. కానీ ఫైనల్ రిజల్ట్స్ లో ఎలాంటి తేడా జరిగినా ఆశ్చర్యం లేదు.

Mannara Chopra: ఈ పోజు ఏంటో.. చీరకట్టులోనూ ఇంత హాటా!

శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకెళ్తుంటే హీరోయిన్ ఎవరన్న దానిపై చాలా పేర్లే ట్రెండ్ అయ్యాయి. చివరికి శంకర్ అగ్రిమెంట్ ప్రకారం చరణ్ జోడీగా సెట్టయింది కియారా అద్వానీ. ఇద్దరూ కలిసి ఫటాఫట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చెర్రీ యాక్ట్ చేయబోయే సినిమాలో నటించే హీరోయిన్ పై ఇప్పుడు మళ్లీ ఫ్యాన్స్ కి డౌట్స్ మొదలయ్యాయి. స్పోర్ట్స్ బ్రాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్ లోనే చరణ్ – గౌతమ్ తిన్ననూరి సినిమా ఉండబోతుంది కాబట్టి ఆ లెవెల్ అందగత్తెకే ఈ అవకాశం వరించనుంది.

Aishwarya Rajesh: ప్యూర్ హోమ్లీ లుక్‌లో ఐశ్వర్య.. ఫోటోలు!

150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోన్న గ్లోబల్ స్టార్ ప్రభాస్ సరసన సూపర్ బ్యూటీనీ సెట్ చేయండ అంత ఈజీ కాదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తన 25వ సినిమాను ప్లాన్ చేసిన ప్రభాస్ ప్రతీది స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ స్పిరిట్ ప్రాజెక్ట్ లో కొరియన్ హీరోయిన్ అన్న వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. కొరియన్టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యోను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!

సీనియర్ హీరోలకు హీరోయిన్ దొరకడం కష్టంగా మారింది. ఎందరినో అనుకుని.. ఎన్నో గాసిప్స్ నడిచిన తర్వాత బాలకృష్ణ-మలినేని గోపీచంద్ సినిమాలో శృతీ హాసన్ ఫిక్సయింది. సేమ్ టు సేమ్ చిరూ భోళాశంకర్ కోసం తమన్నాను తీసుకొచ్చారు. ఇక వరుసగా సినిమాలనైతే ప్రకటిస్తున్నారు కానీ మెగాస్టార్ సినిమాల్లో భామలెవరన్న దానిపై క్లారిటీ రావడటానికి ఇంకాస్త టైం పడుతుంది. ఇక మరో సీనియర్ నాగ్ కి కూడా హీరోయిన్ కష్టాలున్నాయి. బంగార్రాజులో సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృషతోనే కనిపించనున్న నాగ్.. ఘోస్ట్ నుంచి కాజల్ తప్పుకున్న తర్వాత ఎవరితో రొమాన్స్ చేస్తారన్నదానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.