Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

మెగాస్టార్.. పవర్ స్టార్.. సూపర్ స్టార్.. రెబల్ స్టార్.. ఇలా స్టార్లంతా సమ్మర్ బరిలోనే తొడ గొడుతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ తో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న పెద్ద హీరోల సినిమాలన్ని..

Summer Releases: స్టార్లంతా సమ్మర్ బరిలోనే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా!

Summer Releases

Summer Releases: మెగాస్టార్.. పవర్ స్టార్.. సూపర్ స్టార్.. రెబల్ స్టార్.. ఇలా స్టార్లంతా సమ్మర్ బరిలోనే తొడ గొడుతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ తో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్న పెద్ద హీరోల సినిమాలన్ని ఒకేసారి రాబోతున్నాయి. బాక్సాఫీస్ పై భారీ సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. ఎవరెవరు.. ఎప్పుడెప్పుడు ముహూర్తం పెట్టుకుంటున్నారోనని వాళ్ళ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Pushpa: శ్రీవల్లి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేస్తే?!

భీమ్లా నాయక్ నుంచి మొదలుపెడితే త్రిబుల్ ఆర్ దాకా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువున్న సినిమాలన్ని సమ్మర్ లోనే సందడి చేయనున్నాయి. మొదట్లో ఒక సినిమా రిలీజ్ తో మరో దానికి కనెక్షన్ లేకపొయ్యినా.. కోవిడ్ పుణ్యమా అని పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికంటే ముందు శివరాత్రికి భీమ్లా నాయక్ డ్యూటీ ఎక్కబోతున్నాడు. వడివడిగ షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఫిబ్రవరి 25న బాక్సాఫీస్ వద్ద భీమ్లా రచ్చ మొదలవ్వనుంది.

Ravi Teja: సక్సెస్ తెచ్చిన కిక్.. కోవిడ్‌ను లెక్క చేయని హీరో మాస్ రాజా!

అన్నింటికి మించి ఈసారి ఏప్రిల్ నెల ఆడియన్స్ కు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. మెగాస్టార్ ఆచార్య, సూపర్ స్టార్ సర్కారు వారి పాట రెండు సినిమాలు ఏప్రిల్ ఒకటిన.. ఒకే రోజు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ చూస్తుంటే.. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

మోస్ట్ వాంటెడ్ మూవీ కేజీఎప్ చాప్టర్ 2.. ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే త్రిబుల్ ఆర్ కూడా మార్చి 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. లేదంటే ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఒకే నెలలో ఇన్ని భారీ సినిమాలు రిలీజ్ ఐతే మాత్రం.. థియేటర్లలో సీట్లు చిరగడం.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా.

Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!

హాట్.. హాట్ మార్చ్ మంథ్ లో.. ఆడియన్స్ కి కూల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రామా రావ్ సిద్దమవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ మూవీ.. రామారావ్ ఆన్ డ్యూటీ మార్చి 25న రిలీజ్ కానుంది, డేట్ కన్ఫామ్ ఐతే.. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా మార్చిలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ సమ్మర్లో భారీ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ కరువు తీరబోతోంది.