Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు నిన్న దుబాయ్‌లోని అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫాలో జరిగాయి. ప్రపంచంలో ఎత్తైన ఈ భవనంలోని ఓ ఫ్లోర్‌లో అర్హ పుట్టినరోజు వేడుకల్ని

Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

Allu Arha

Allu Arha :  రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్నట్టు డబ్బున్నవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరో సారి నిరూపించారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకి తెలిసిందే. ఖాళీ దొరికితే తన భార్య ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతాడు. నిన్న అర్హ పుట్టినరోజు రోజు సందర్భంగా అల్లు అర్జున్ తన గారాలపట్టికి చేసిన బర్త్ డే సెలబ్రేషన్ ప్రపంచంలోనే కొత్త రికార్డు సృష్టించింది.

Jai Bhim : క్షమాపణలు చెప్పిన ‘జై భీమ్’ డైరెక్టర్

తన కూతురి పుట్టిన రోజు వేడుకలకి అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు నిన్న దుబాయ్‌లోని అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫాలో జరిగాయి. ప్రపంచంలో ఎత్తైన ఈ భవనంలోని ఓ ఫ్లోర్‌లో అర్హ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. అయితే ఇది చాలా ఎత్తులో జరిగిందని, ఈ ఫ్లోర్ మొత్తం పూర్తి వ్యక్తిగతమైన ప్రైవేట్‌ ఫ్లోర్‌ అని, ఇప్పటివరకు ఎవరూ ఇందులో జన్మదిన వేడుకలు జరుపుకోలేదని సమాచారం. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో అత్యంత ఎత్తులో జరుపుకున్న తొలి పుట్టినరోజు వేడుక ఇదేనని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహారెడ్డితో పాటు కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు.

NTR : ఈఫిల్ టవర్ వద్ద తనయుడికి ముద్దు పెడుతున్న ఎన్టీఆర్

ఈ పుట్టిన రోజు వేడుక కోసం అల్లు అర్జున్ భారీగానే ఖర్చు పెట్టాడని సమాచారం. అంత ఎత్తులో ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేయడానికి, పుట్టిన రోజు వేడుక చేయడానికి తన కూతురి కోసం బన్నీ బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఇక అల్లు అర్హ త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో తెరంగ్రేటం చేయనుంది.