NTR : ఈఫిల్ టవర్ వద్ద తనయుడికి ముద్దు పెడుతున్న ఎన్టీఆర్

ఇటీవలే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ను, ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం షూటింగ్ ను పూర్తిచేసుకొని నెక్స్ట్ సినిమా మొదలయ్యేలోపు ఒక రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో చాలా

NTR : ఈఫిల్ టవర్ వద్ద తనయుడికి ముద్దు పెడుతున్న ఎన్టీఆర్

Ntr

Updated On : November 22, 2021 / 6:32 AM IST

NTR :  జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కోసం కూడా సమయం కేటాయిస్తారు. ఎన్టీఆర్ ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేయకపోయినా తన పిల్లలిద్దరితో బాగానే ఎంజాయ్ చేస్తారు. చాలా రేర్ గా పిల్లల ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఎన్టీఆర్. ఇటీవలే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ను, ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం షూటింగ్ ను పూర్తిచేసుకొని నెక్స్ట్ సినిమా మొదలయ్యేలోపు ఒక రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశారు ఎన్టీఆర్.

Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి పారిస్‌ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఈ ఖాళీ సమయాన్ని ఆనందిస్తున్నారు. పారిస్ ఈఫిల్ టవర్ వద్ద పెద్ద కుమారుడు అభయ్‌రామ్‌ని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఎంతో ప్రేమగా ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసి ‘కనులకు విందైన ఈఫిల్‌ టవర్‌’ అంటూ పోస్ట్ చేశారు. మరి కొన్ని రోజులు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఈ హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని జనవరిలో కొరటాల శివతో సినిమా మొదలు పెట్టనున్నారని సమాచారం.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)