Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

ఇప్పటికే జనవరి 7న 'ఆర్ఆర్ఆర్', జనవరి 12న 'భీమ్లానాయక్', జనవరి 14న 'రాధేశ్యామ్' సినిమాలు అనౌన్స్ చేశారు. మహేష్ 'సర్కారు వారి పాట' కూడా సంక్రాంతికి అనౌన్స్ చేసినా తర్వాత వాయిదా

Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

Sankranthi Movies

Sankranthi Movies :  తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ. తెలుగు సినిమాలకి కూడా సంక్రాంతిని పెద్ద పండుగ. స్టార్ హీరోలంతా పండగలకే సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తారు. పండగల్లో ఇంటిల్లిపాది కలిసి సినిమాలు చూడటానికి వెళ్తారు. పండగలకి సెలవులు ఉండటంతో కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. దీంతో చాలా మంది సినిమాలు పండగలకి రిలీజ్ చేస్తారు. ఇక సంక్రాంతి పెద్ద పండుగా కావడంతో సెలవులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేవి.

Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్.. చెలరేగిన మంటలు..

గత సంవత్సర కాలం పైగా కరోనాతో సినీ పరిశ్రమ సతమతమవుతోంది. ఒక పక్క థియేటర్లు లేక, మరో పక్క షూటింగ్స్ సరిగా జరగక నష్టాల్లో కూరుకుపోయింది సినీ పరిశ్రమ. ఇటీవలే థియేటర్స్ ఓపెన్ చేయడంతో ఇన్నాళ్లు ఆగిపోయిన సినిమాలు వరుసగా రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ సారి సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలన్నీ అనౌన్స్ చేశారు. కానీ ఒకేసారి అందరూ అనౌన్స్ చేయడంతో బిజినెస్ దెబ్బ పడుతుందని ఒకరిద్దరు వెనక్కి తగ్గారు కూడా. ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో దాదాపు 1000 కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది.

Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

ఇప్పటికే జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి 12న ‘భీమ్లానాయక్’, జనవరి 14న ‘రాధేశ్యామ్’ సినిమాలు అనౌన్స్ చేశారు. మహేష్ ‘సర్కారు వారి పాట’ కూడా సంక్రాంతికి అనౌన్స్ చేసినా తర్వాత వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 15న ‘బంగార్రాజు’ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు నాగార్జున.

Megastar : యువ దర్శకుడితో మరో సినిమా ఫిక్స్ చేసిన మెగాస్టార్

‘ఆర్ఆర్ఆర్’ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు. రాజమౌళి 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో పాన్ ఇండియా వైడ్ గా బరిలోకి దిగుతున్నాడు. ఇక ‘రాధేశ్యామ్’ బడ్జెట్ 150 కోట్లు. కనీసం 300 కోట్లు అయినా కలెక్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఇక పవన్ కళ్యాణ్ రానా కాంబినరేషన్ లో వచ్చే ‘భీమ్లానాయక్’ బడ్జెట్ 80 కోట్ల పైనే. ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతుంది. లాస్ట్ లో నాగార్జున 50 కోట్ల పెట్టుబడితో ‘బంగార్రాజు’ తీసుకొస్తున్నాడు.

Naga Chaitanya : లవ్ లెటర్స్ టు లైఫ్.. విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ పోస్ట్

ఇలా స్థార్ హీరోలంతా కలిసి ఈ సారి సంక్రాంతికి గట్టిగానే ప్లాన్ చేశారు. అన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా భారీగానే ఆశిస్తున్నారు నిర్మాతలు. ఈ సంక్రాంతికి ఈ నాలుగు సినిమాలే దాదాపు 1000 కోట్లకు పైగా బిజినెస్ చేస్తాయని ఆశిస్తున్నారు. ఇదే జరిగితే సినీ పరిశ్రమకి మంచి ఊపు వచ్చినట్టే.