Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్.. చెలరేగిన మంటలు..

ప్రస్తుతం రకుల్ ముంబైలోనే నివాసం ఉంటుంది. తాజాగా రకుల్ నివసించే బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది.

Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్.. చెలరేగిన మంటలు..

Rakul

Updated On : November 21, 2021 / 10:01 AM IST

Rakul Preet Singh :  టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం రకుల్ ముంబైలోనే నివాసం ఉంటుంది. తాజాగా రకుల్ నివసించే బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది.

Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

నిన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అందరూ బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో బిల్డింగ్ లో నివసించే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు చెలరేగడానికి కారణాలు తెలియలేదు.