Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

ప్రతి సారి లాగే రెండు రోజుల క్రితం వీళ్ళిద్దరూ గొడవ పడి మళ్ళీ కలిసిపోయారు.అయితే వీళ్లిద్దరి గొడవలు, ప్రేమ, స్నేహం గురించి నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడారు. సిరి షణ్ను

Bigg Boss 5 : తప్పో రైటో నాకు తెలీదు.. షణ్నుతో నేను ఇంకా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను

Bb5

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో మొన్నటి దాకా అందరూ మానస్, ప్రియాంకల లవ్ ట్రాక్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఇటీవల అందరూ సిరి షణ్ను ఫ్రెండ్షిప్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క ఫ్రెండ్స్ అంటూనే హగ్గులు, ముద్దులు, ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవడం లాంటివి చేస్తూ షోలో డీప్ గా వెళ్లిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి హౌస్ లో వీళ్ళ బంధం మరింత బలపడుతుంది. బయట వీళ్లిద్దరికీ లవర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు బిగ్ బాస్ కి రాకముందు నుంచే ఫ్రెండ్స్ అవడం వల్ల మరింత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.

Megastar : యువ దర్శకుడితో మరో సినిమా ఫిక్స్ చేసిన మెగాస్టార్

ప్రతి సారి లాగే రెండు రోజుల క్రితం వీళ్ళిద్దరూ గొడవ పడి మళ్ళీ కలిసిపోయారు.అయితే వీళ్లిద్దరి గొడవలు, ప్రేమ, స్నేహం గురించి నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మాట్లాడారు. సిరి షణ్నుతో గొడవ తర్వాత బాత్రూంలోకి వెళ్లి తల కొట్టుకుంది. బాత్రూం లోపల, బయట తల కొట్టుకుంటూ నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావని నాగ్‌ సిరిని అడిగాడు. ఆమెను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిపించి మాట్లాడాడు. కోట్లమంది నిన్ను చూసి ఈ అమ్మాయిలా ఉండాలనుకోవాలి కానీ ఈవిడలా మాత్రం ఉండకూడదు అనేలా చేసుకోకు అన్నాడు. నాగ్ నీ ప్రాబ్లెమెంటొ చెప్పు అన్నాడు సిరితో. దీంతో ఓపెన్‌ అయిన సిరి.. ‘నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నేను ఎదుటివాళ్లను హర్ట్‌ చేసే వ్యక్తిని కాను. ఎవరేం అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచేకొద్దీ షణ్నుతో నా కనెక్షన్‌ ఇంకా ఎమోషనల్‌ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్‌ తప్పని తెలిసినా సరే చేస్తున్నాను’ అని చెప్తూ బాధపడింది సిరి. ఇంకోసారి ఇలా గాయపర్చుకుంటే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి పంపించేస్తానని నాగ్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో మరోసారి రిపీట్‌ చేయనని మాటిచ్చింది సిరి.

Naga Chaitanya : లవ్ లెటర్స్ టు లైఫ్.. విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ పోస్ట్

ఆ తర్వాత షణ్నుని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిపించాడు నాగ్. షణ్ను మాట్లాడుతూ.. నేను మెంటల్లీ వీక్‌ అయిపోయాను. సిరి అలా తనను తాను గాయపర్చుకోవడానికి కారణం నేనే, నాదే తప్పు అని అన్నాడు. దీప్తి సునయనను మిస్‌ అవుతున్నావా? అని నాగ్ అడగడంతో అవును అని చెప్పాడు షణ్ను. దీంతో దీప్తిని మిస్‌ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్‌. షణ్ను స్టన్ అయిపోయి సారీ చెప్పాడు. ఇంకోసారి ఇలా మాట్లాడకు అని నాగ్ హెచ్చరించాడు.