Megastar : యువ దర్శకుడితో మరో సినిమా ఫిక్స్ చేసిన మెగాస్టార్

'గాడ్ ఫాదర్', 'భోళాశంకర్' సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇవే కాక యంగ్ డైరెక్టర్ బాబీ సినిమా కూడా త్వరలో ప్రారంభమవనుంది. మెగాస్టార్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం.

Megastar : యువ దర్శకుడితో మరో సినిమా ఫిక్స్ చేసిన మెగాస్టార్

Chiru

Megastar :  ఇటీవల మెగాస్టార్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక పక్క యువ హీరోలు సంవత్సరానికి ఒక సినిమానే కష్టంగా తీస్తుంటే ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి వరుసగా సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ‘గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇవే కాక యంగ్ డైరెక్టర్ బాబీ సినిమా కూడా త్వరలో ప్రారంభమవనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెగాస్టార్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం.

Naga Chaitanya : లవ్ లెటర్స్ టు లైఫ్.. విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ పోస్ట్

‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించి విజయం సాధించిన డైరెక్టర్ వెంకీ కుడుముల. ఇటీవల వెంకీ కుడుముల మెగాస్టార్ కి కథ వినిపించారని, మెగాస్టార్ కి కథ నచ్చి ఓకే చేశారని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డివివి సంస్థ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ లో బిజీగా ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యాక మెగాస్టార్ వెంకీ సినిమాని అనౌన్స్ చేయొచ్చు అని తెలుస్తుంది.