Naga Chaitanya : లవ్ లెటర్స్ టు లైఫ్.. విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ పోస్ట్

చైతన్య మాత్రం పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు. విడాకుల అనంతరం దాదాపు 40 రోజుల తర్వాత మళ్ళీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు చై. ఇప్పుడు ఈ పోస్ట్

Naga Chaitanya : లవ్ లెటర్స్ టు లైఫ్.. విడాకుల తర్వాత నాగ చైతన్య ఫస్ట్ పోస్ట్

Chay

Updated On : November 21, 2021 / 7:34 AM IST

Naga Chaitanya :  సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత సమంత రోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హల్ చల్ చేస్తుంటే చైతన్య మాత్రం ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సమంత రోజూ లవ్, పెళ్లి, జీవితం గురించి పోస్టులు పెడుతూ అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చేసుకుంటుంది. చైతన్య మాత్రం పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు. విడాకుల అనంతరం దాదాపు 40 రోజుల తర్వాత మళ్ళీ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు చై. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నటి షాలు చౌరాసియాపై దాడి చేసిన దొంగ అరెస్ట్ _ Police Arrests Accused in Actress Chaurasia Case

పాపులర్‌ రైటర్‌ మాథ్యూ రాసిన ‘గ్రీన్‌ లైట్స్‌’ అనే పుస్తకాన్ని షేర్‌ చేసి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు చైతూ. ‘లవ్‌ లెటర్స్‌ టూ లైఫ్‌..మీ జర్నీని షేర్‌ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ. ఈ పుస్తకం నాకు నిజంగా జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది అనే అర్ధం వచ్చేలా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఫస్ట్ టైం ఇలా లైఫ్ గురించి, లవ్ గురించి పోస్ట్ పెట్టడంతో చైతూ కూడా సమంతని ఇంకా మర్చిపోలేదని, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడని అర్ధమవుతుంది. అందుకోసమే ఇలాంటి బుక్స్ చదువుతున్నాడని తెలుస్తుంది. మొత్తానికి సమంత, చైతన్య ఇద్దరూ ఇద్దర్ని మర్చిపోయి జీవితంలో ముందుకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Chay Akkineni (@chayakkineni)