Allu – Mega Family : మొన్న బన్నీ, ఇప్పుడు అల్లు అరవింద్.. ఆ రూమర్స్‌కి మరోసారి గట్టి కౌంటర్..

ఆ రూమర్స్ కి మరోసారి అల్లు కుటుంబం గట్టి కౌంటర్ ఇచ్చింది. మొన్న బన్నీ, ఇప్పుడు అల్లు అరవింద్..

Allu – Mega Family : మొన్న బన్నీ, ఇప్పుడు అల్లు అరవింద్.. ఆ రూమర్స్‌కి మరోసారి గట్టి కౌంటర్..

Allu Arjun Allu Aravind gave clarity about gap with Ram Charan Chiranjeevi

Allu – Mega Family : అల్లు అండ్ మెగా ఫ్యామిలీ బంధం గురించి ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా నెంబర్ వన్ రేస్ లో పోటీపడుతూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అయితే ఆ పోటీ ప్రొఫిషనల్ వరుకు మాత్రమే అని, కనిపించడానికి అల్లు-మెగా రెండు కుటుంబాలు కావొచ్చు గాని, తమకి మాత్రం ఒకటే కుటుంబం అని, ఈ క్రమంలోనే గెలుపు ఎవరు సాధించిన కుటుంబమంతా సెలబ్రేట్ చేసుకుంటామని గతంలో ఒక టీవీ షోలో అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Rajinikanth : విజయ్ ‘బీస్ట్’ మూవీ హిట్ అయ్యిందా..? ప్లాప్ అయ్యిందా..? రజినీకాంత్ కామెంట్స్..

అయితే ఈ మధ్య మళ్ళీ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరమని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటన్నికి అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇటీవల బేబీ (Baby) మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న బన్నీ మాట్లాడుతూ.. “నేను, శిరీష్ కట్టే కాలేవరకు చిరంజీవి గారి అభిమానులమే అందులో ఎటువంటి సందేహం లేదు” కుండా బద్దలుకొట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చిరంజీవి పై అభిమానం ఎటువంటిదో అభిమానులకు మరోసారి తెలియజేశాడు.

Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్..

ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి పై అభిమానాన్ని ఇవాళ నేను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం చెబుతా. ఆయన చేసే సేవ కార్యక్రమాల పై తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తులను జైలుకి పంపించేందుకు 12 ఏళ్ళు పాటు పోరాడి గెలిచాను. అది ఆయన పై నా అభిమానం” అని పేర్కొన్నాడు. అల్లు కుటుంబం నుంచి వచ్చిన కామెంట్స్ తో అయినా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కి ఇప్పటికైనా చెక్ పడుతుందా? లేదా? చూడాలి.