Allu Arjun : అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడు.. వరుడు హీరోయిన్ భానుశ్రీ!

అల్లు అర్జున్, గుణశేఖర్ కలయికలో వచ్చిన వరుడు సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడు అంటూ సంచలన ట్వీట్ చేసింది.

Allu Arjun : అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడు.. వరుడు హీరోయిన్ భానుశ్రీ!

Allu Arjun blocked his heroine Bhanu Sri Mehra in twitter

Allu Arjun : అల్లు అర్జున్, గుణశేఖర్ కలయికలో వచ్చిన వరుడు సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమా హిట్ కాకపోయినా అందులోని 5 రోజులు పెళ్లి కాన్సెప్ట్ మాత్రం అందరికి కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి చాలా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ అయ్యి, ఇంటర్వెల్ వరకు హీరోయిన్ పేస్ రివీల్ చేయలేదు. పంజాబీ భామ అయిన భానుశ్రీ మెహ్రా వరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే ఆమె హీరోయిన్ గా కనిపించింది. ఛాన్స్ లు రాకపోవడంతో అడపాదడపా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సినిమాల్లో కనిపిస్తుంది.

Allu Arjun : బిగ్ అనౌన్స్‌మెంట్ ఉందంటున్న ఆహా.. అల్లు అర్జున్‌తో ఆహా కొత్త షో ప్లాన్ చేస్తుందా?

అలాగే భానుశ్రీ మెహ్రా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తుంది. ఆ ఛానల్ చేసే వీడియోస్ ని ప్రమోట్ చేస్తూ ట్విట్టర్ లో చాలా హుషారుగా ఉంటుంది. తాజాగా ఈమె చేసిన ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసింది. ”నేను అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించాను. ఆ మూవీ తరువాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ నేను నా ప్రయత్నం ఆపలేదు. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురుకున్నా, వాటిలో కూడా హాస్యాన్ని వెతకడం నేర్చుకున్నాను. కానీ ఇక్కడి చూడండి అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు” అంటూ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ చేసిన రెండు గంటలకే మరో ట్వీట్ చేసింది. ”గ్రేట్ న్యూస్ అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశాడు. నేను అల్లు అర్జున్ ని నిందించడం లేదు. నా కష్టాల్లో కూడా హాస్యాన్ని వెతుకొని ముందుకు సాగడం నేర్చుకుంటున్నా” అంటూ ట్వీట్ చేసింది. అయితే అల్లు అర్జున్ బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటనేది తెలియలేదు.